RRR Movie Documentary: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో #RRR చిత్రం ఒక అద్భుతం. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు దైవం లాగా ఆరాధించే నేటి తరం మాస్ హీరోలను ఒకే సినిమాలో చూపించాలనే ఆలోచన వచ్చిన రాజమౌళి కి అభిమానులు సెల్యూట్ చేసారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు కలిసి మల్టీస్టార్రర్ చేస్తే ఎలాంటి అద్భుతాలు నెలకొల్పాలని మనమంతా ఆశిస్తామో, అంతకు మించిన అద్భుతాలను ఈ చిత్రం నెలకొల్పింది. కేవలం ఇండియన్ మూవీ లవర్స్ కి మాత్రమే ఈ చిత్రం పరిమితం కాలేదు. గ్లోబల్ వైడ్ గా సినిమాలను ఇష్టపడే ప్రతీ ఒక్కరికి ఈ చిత్రం నచ్చింది. అసలు ఇంత అద్భుతంగా ఎలా తియ్యగలిగారు అని రాజమౌళి ని పొగడ్తలతో ముంచి ఎత్తారు. హీరోలిద్దరికి మంచి క్రేజ్ వచ్చింది. వీళ్ళ ప్రతిభ కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పటికీ అభిమానులు ఈ సినిమా మిగిలించిన మధురమైన జ్ఞాపకాలను మర్చిపోలేదు.
అయితే ఈ సినిమా మేకింగ్ ఎలా ఉంటుంది అని తెలుసుకునే కుతూహలం ప్రతి అభిమాని లో ఉంటుంది. ఎందుకంటే రాజమౌళి తీసిన కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ దర్శకులు కూడా ఇప్పటి వరకు తియ్యలేదు. ఉదాహరణకి రామ్ చరణ్ పరిచయ సన్నివేశం, జూనియర్ ఎన్టీఆర్ క్రూర జంతువులను ఇంటర్వెల్ సన్నివేశం తన వెంట పట్టుకొని దిగడం, ఇలా ఒక్కటా రెండా, ఎన్నో సన్నివేశాలు, హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ కి కూడా మతిపోగొట్టేలా చేసింది. ఆ సన్నివేశాలన్నీ ఎలా చేసారు, తెరవెనుక #RRR ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎలాంటి కష్టాలు పడ్డారు ఇలా ఎన్నో అంశాలను డాక్యూమెంటరీ గా చేసి నేడు థియేటర్స్ లో విడుదల చేసింది మూవీ టీం. ముఖ్యంగా ‘నాటు నాటు’ పాటకు రామ్ చరణ్, ఎన్టీఆర్ లను రాజమౌళి ఎంతలా టార్చర్ పెట్టాడో మొన్న విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది.
పాపం వాళ్ళిద్దరికీ ఊపిరి కూడా ఆడలేనంత రేంజ్ లో ఉతికి ఆరేసాడు. అయితే ఈ డాక్యుమెంటరీ ని థియేటర్స్ లో చూడాలని మీరు కూడా అనుకుంటున్నారా..?, హైదరాబాద్ లో ఉండే అభిమానులకు ఈ చిత్రం థియేటర్స్ లో అందుబాటులో ఉంది. వెంటనే బుక్ మై షో యాప్ లో టికెట్స్ ని బుక్ చేసుకోండి. ‘RRR – బిహైండ్ అండ్ బెయాండ్’ అనే పేరు తో బుక్ మై షో లో వెతికితే ఈ డాక్యుమెంటరీ ఆడుతున్న థియేటర్స్ లిస్ట్ వస్తుంది. AMB , ప్రసాద్ ముల్టీప్లెక్స్ మరియు PVR స్క్రీన్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. టికెట్ రేట్స్ 200 నుండి 250 రేంజ్ లో ఉన్నాయి. AMB లో ఒక షోకి మూవీ కి టీం కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది. ఓటీటీ లో చూడాలి అనుకునే అభిమానులు కొన్ని రోజులు ఆగాల్సిందే.