Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం సరిగ్గా మరో 20 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్ కి ఇప్పటికే ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కోసం రామ్ చరణ్ తో పాటు, మూవీ టీం మొత్తం నిన్న రాత్రి అమెరికా కి బయలుదేరారు. చరిత్రలో ఒక తెలుగు సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విదేశాల్లో చెయ్యడం ఇదే తొలిసారి కావడంతో మేకర్స్ ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. డిసెంబర్ 27 న గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా జరగబోతుంది. ఆ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు టాక్. అదే విధంగా జనవరి 4 న ఆంధ్ర ప్రదేశ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చెయ్యబోతున్నారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనుంది మూవీ టీం. పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన చివరి చిత్రం ‘నాయక్’. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఈ ఈవెంట్ కి రాబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఇటీవలే ‘పుష్ప 2 ‘ ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ లో ఏర్పడిన తొక్కిసిలాట ఘటన ఎంతటి సంచలనం రేపిందో మన అందరికీ తెలిసిందే. ఈ ఘటన లో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీ తేజ్ చావు బ్రతుకుల మధ్య కిమ్స్ ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
అయితే ఈ ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం, బెయిల్ మీద విడుదల అవ్వడం వంటి ఘటనలు నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ అయ్యింది. అంతే కాకుండా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోటంరెడ్డి ఇక మీదట తెలంగాణ లో సినిమాలకు బెన్ఫిట్ షోస్ ఇవ్వము అంటూ ఒక ప్రకటన కూడా చేసాడు. దీంతో రామ్ చరణ్ అభిమానులు ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని తెలంగాణాలో బెన్ఫిట్ షోస్ ద్వారా చూడలేము అని డీలాపడ్డారు. కానీ నిన్న ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘గేమ్ చేంజర్ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ రేంజ్ లో బెనిఫిట్ షోస్ ని ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పుకొచ్చాడు. రీసెంట్ గానే దిల్ రాజు తెలంగాణ ప్రభుత్వం తరుపున తెలుగు ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసాడు. అందుకే ఆయనకీ బెన్ఫిట్ షోస్ అనుమతి వచ్చింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. అయితే ఇది కేవలం దిల్ రాజు సినిమాలకు మాత్రమే లభిస్తాయా?, లేదా మిగిలిన సినిమాలకు కూడా బెనిఫిట్ షోస్ ఇస్తారా అనేది చూడాలి.