Director Sujeeth Wife: ప్రతిభ ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రతీ ఒక్కరికి అవకాశం ఇస్తుంది అనేందుకు ఇండస్ట్రీ లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్ళు ప్రారంభం లో ఎన్నో కష్టాలను అనుభవించినా, ఇప్పుడు మాత్రం ఎవ్వరూ చూడని ఎత్తులను చూస్తున్నారు. అందుకు ఉదాహరణగా డైరెక్టర్ సుజిత్ ని చెప్పుకోవచ్చు. షార్ట్ ఫిలిమ్స్ తీసుకునే ఈ కుర్రాడి టాలెంట్ ని గుర్తించి యూవీ క్రియేషన్స్ బ్యానర్ ‘రన్ రాజా రన్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చింది.
శర్వానంద్ హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయ్యింది, ఆ తర్వాత ఏకంగా ప్రభాస్ ‘సాహూ’ సినిమాకి డైరెక్షన్ చేసే రేంజ్ కి ఎదిగాడు.ఈ చిత్రం కమర్షియల్ గా ఎబోవ్ యావరేజి అయ్యింది. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ తో #OG లాంటి భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రం పై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో ఉన్న అంచనాలు మామూలైవి కాదు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా సుజిత్ భార్య ప్రవళిక గురించి సోషల్ మీడియా లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. 2020 వ సంవత్సరం లో వీళ్లిద్దరు గోల్కొండ రిసార్ట్స్ లో పెళ్లి చేసుకున్నారు.ఈ పెళ్ళికి టాలీవుడ్ కి చెందిన కొంతమంది ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఇప్పుడు ఈ దంపతులిద్దరికీ ఒక పాప కూడా ఉంది, ఇదంతా పక్కన పెడితే ప్రవళిక బ్యాక్ గ్రౌండ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. వివరాల్లోకి వెళ్తే ఈమె హైదరాబాద్ లోనే టాప్ 10 డెంటిస్ట్స్ లో ఒకరట.ఈమె నెల సంపాదన 10 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. అంటే ఏడాదికి సుజిత్ సంపాదించే దానికంటే ఎక్కువ ప్రవళిక సంపాదిస్తుంది అన్నమాట.ఆమెకి సంబంధించిన కొన్ని ఎక్సక్లూసివ్ ఫోటోలు మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.సుజిత్ హీరోలాగా ఉంటాడు, ఇక ప్రవళిక కూడా హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది,వీళ్లిద్దరి జంట టాలీవుడ్ లోనే మోస్ట్ క్యూట్ జంటలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.