Game Changer 2nd song
Game Changer 2nd song : సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ సినిమాల్లో పాటలు ఎలా ఉంటాయో మనం చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. ఆరోజుల్లోనే ఆయన ఆ పాటలకు కళ్ళు చెదిరే గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్స్ వేసి తెరకెక్కించేవాడు. సినిమా టాకీ పార్ట్ కి బడ్జెట్ తగ్గినా పర్వాలేదు కానీ, ఆయన సినిమాల్లోని పాటలకు నిర్మాతలను ఎంత బడ్జెట్ అడిగితే అంత ఇవ్వాల్సిందే. ఆ విషయం లో అసలు తగ్గదు శంకర్. ఇప్పుడు రామ్ చరణ్ తో తీసిన ‘గేమ్ చేంజర్’ చిత్రం లోని పాటలకు కూడా ఆయన నిర్మాత దిల్ రాజు తో అదే స్థాయిలో ఖర్చు పెట్టించాడు. మొదటి లిరికల్ వీడియో సాంగ్ ‘జరగండి..జరగండి’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ పాటలోని సెట్స్ చూసేందుకు ఎంతో కొత్తగా అనిపించింది. శంకర్ మార్క్ సాంగ్ అంటే ఇది కదా అని అందరూ అనుకున్నారు.
ఈ పాటకు ప్రభుదేవా మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు. ఇందులో రామ్ చరణ్ వేసే స్టెప్పులు అదిరిపోతాయని. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ కి సరైన డ్యాన్స్ ఉండే సాంగ్ పడిందని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన రెండవ పాట ‘రా..మచ్చ మచ్చ’ పాటకు సంబంధించిన ప్రోమో ని ఈ నెల 28 వ తారీఖున విడుదల చేయబోతున్నారు. అలాగే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ని 30 వ తేదీన విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ పాట శంకర్ కి అమితంగా ఇష్టమట. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో కలిసి కేవలం ఈ పాట కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో వీళ్లిద్దరు ఈ సాంగ్ ప్రత్యేకతలు గురించి మాట్లాడుకున్నారు. శంకర్ మాట్లాడుతూ ‘ఈ పాట కోసం కర్ణాటక, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాల నుండి వాళ్ళ సాంస్కృతిక నృత్య కళాకారులను తీసుకొచ్చాము. కేవలం ఒక్క కర్ణాటక ప్రాంతం నుండే మూడు భిన్నమైన సాంస్కృతిక నృత్య కళాకారులను తీసుకొచ్చాము. ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఎప్పుడూ జరగనిది. గణేష్ ఆచార్య మాస్టర్ ఈ పాటకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించాడు. నా కెరీర్ లోనే ఈ పాట ది బెస్ట్ గా నిలిచిపోతుందని చెప్పగలను’ అంటూ చెప్పుకొచ్చాడు శంకర్.
ఇంకా ఆయన రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ‘రామ్ చరణ్ ఇండియా లోనే టాప్ మోస్ట్ డ్యాన్సర్స్ లో ఒకడు. ఒక మ్యూజిక్ బిట్ కి ఆయన కేవలం ఒక్క టేక్ లోనే పూర్తి చేసాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ పాట చిత్రం లో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ గా ఉండబోతోంది అట. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. మొదటి పాత్ర చాలా షార్ట్ టెంపర్ తో ఉంటుందట. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Director shankar explained the features of the 2nd song of game changer movie