Director Raghavendra Rao: దర్శకుడు రాఘవేంద్రరావు కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాఘవేంద్రరావుకు ప్రభుత్వ భూమి భూకేటాయింపుకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన తెలంగాణ హైకోర్టు దర్శకుడు రాఘవేంద్రరావుతో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేసింది. బంజారా హిల్స్ లో రెండు ఎకరాల భూమిని రాయితీ ధరకు రాఘవేంద్రరావుకు కేటాయించారు.
ఈ భూమిని తీసుకున్న ఉద్దేశానికి వ్యతిరేకంగా అక్కడ వ్యాపారం జరుగుతుందని మెదక్ కి చెందిన బాల కిషన్ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వం రాయితీ ధరకు ఇచ్చిన రెండెకరాల భూమిలో షరతులు, నిబంధనలకు విరుద్ధంగా బార్లు, పబ్ లు , థియేటర్లు వంటి వ్యాపారాలకు ఉపయోగిస్తున్నారు. ఇది నిబంధనలకువ్యతిరేకం, చట్టాన్ని ఉల్లఘించడమే అని వ్యాజ్యం దాఖలైంది.
పిల్ ఆధారంగా రాఘవేంద్రరావుతో పాటు మరికొందరికి నోటీలుసు జారీలు చేశారు. ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సీనియర్ దర్శకుల్లో ఒకరైన రాఘవేంద్రరావు సినిమాలు తగ్గించారు. 2021 పెళ్లి సందడి చిత్రంలో ఆయన నటించడం విశేషం. ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు.
అలాగే వాంటెడ్ పండుగాడ్ చిత్రానికి కూడా ఆయన అన్నీ తానై వ్యవహరించారు. 2017లో ఓం నమో వెంకటేశాయ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం అంతగా ఆడలేదు. మరలా ఈయన మెగా ఫోన్ పట్టుకోలేదు.