https://oktelugu.com/

CM KCR: కేసీఆర్ ఇప్పటికీ చూసే సినిమా ఏదో తెలుసా?

యవ్వనంలోనే రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు తిరుగులేని నేతగా నిలిచారు. ఆయన ఎక్కడ పోటీ చేసినా అక్కడ విజేతగా నిలిచారు.అయితే కేసీఆర్ మొదట కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 10, 2023 / 02:33 PM IST

    CM KCR

    Follow us on

    CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికే కాదు.. దేశంలోనే గుర్తింపు పొందిన రాజకీయ నేత. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఆ తరువాత ఏర్పడిన రాష్ట్రంలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. కేసీఆర్ రాజకీయంగా ఎన్నో వ్యూహాలు.. ఎత్తులకు పై ఎత్తులు వేసి రాజకీయ చాణక్యుడిగా పేరొందారు. అయితే ఆయన పర్సనల్ గా నూ ప్రత్యేకంగా ఉంటారు. ఓ వైపు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఉల్లాసంగా ఉండేందుకు ట్రై చేస్తాడు. ఈ క్రమంలో ఆయన ఎక్కువగా సినిమాలు చూస్తుంటారు. ఆయనకు బాగా నచ్చిన సినిమాలేంటంటే?

    యవ్వనంలోనే రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు తిరుగులేని నేతగా నిలిచారు. ఆయన ఎక్కడ పోటీ చేసినా అక్కడ విజేతగా నిలిచారు.అయితే కేసీఆర్ మొదట కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆ తరువాత నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాత అందులో చేరారు. అప్పటికే ఎన్టీఆర్ అంటే కేసీఆర్ కు విపరీతమైన అభిమానం. తన అభిమానాన్ని తన కుమారుడికి ఎన్టీఆర్ పేరుపెట్టి చూపించాడు. తెలుగుదేశంలో కొనసాగిన తరువాత టీఆర్ఎస్ స్థాపించి.. ఆ తరువాత తెలంగాణ ఉద్యమంలోకి వెళ్లారు.

    అప్పటికీ, ఇప్పటికీ కేసీఆర్ మనసు ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా సినిమాలు చూస్తుంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన దానవీరశూరకర్ణ సినిమాను పదే పదే చూస్తుంటారు. ఇప్పటికీ ఆ సినిమా అంటేఎంతో ఇష్టమని తన సన్నిహితుల వద్ద వాపోతుంటారు. ఒక్కోసారి సభల్లో ప్రసంగించేటప్పుడు కేసీఆర్ దానవీర శూర కర్ణ సినిమాలోని డైలాగ్ లను ప్రస్తావిస్తుంటారు. ఈ సినిమా తో పాటు ఎన్టీఆర్ నటించిన ఆరాధన సినిమా అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం.

    ఇక కేసీఆర్ మాంసాహార ప్రియుడు. నాటుకోడి కూర అంటే చాలా ఇష్టం. పలు సందర్భాల్లో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా చేయించుకుంటారు. రాజకీయకాల్లో ఎంత బిజీగా ఉన్నా తనకు ఇష్టమైన ఆహారం తినడంలో ఏమాత్రం కంప్రమైజ్ కారు. పట్టువదలని విక్రమార్కెడిలా ఉన్న కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణలో మరోసారి పీటమెక్కెందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూడాలి.