Kalki 2 Movie
Kalki 2 Movie గత ఏడాది ఇండియన్ మూవీ లవర్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతిని కల్గించిన చిత్రాలలో ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం. మన మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ ని జోడించి, డైరెక్టర్ నాగ అశ్విన్(Naga Ashwin) ఒక అద్భుతాన్ని ఆవిషరించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే #RRR తర్వాత సీక్వెల్ హైప్ లేకుండా, డైరెక్ట్ మూవీ క్యాటగిరీలలో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన సినిమాగా ‘కల్కి'(Kalki 2898 AD) చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. థియేటర్ లో ఈ సినిమాని చూస్తున్నంతసేపు, అసలు మనం తెలుగు సినిమాకి వచ్చామా?, లేదా హాలీవుడ్ సినిమాకి వచ్చామా?, ఇదేమి క్వాలిటీ, ఇదేమి మేకింగ్ బాబోయ్, డైరెక్టర్ ఆలోచనలకూ దండం పెట్టాల్సిందే అంటూ చూసిన ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచెత్తారు. భవిష్యత్తులో ఈ చిత్రం ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ ని సైతం సొంతం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. కల్కి భగవంతుడు భూమి మీదకు ఎలా రాబోతున్నాడు అనే అంశం పై అమితాసక్తిని చూపిస్తున్నారు ఆడియన్స్. నిర్మాత అశ్విని దత్ అయితే ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ ని 60 శాతం కి పైగా పూర్తి చేశామని, కేవలం కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ వరుసగా వేరే ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అవ్వడం వల్ల, ఇప్పట్లో ఈ క్రేజీ సీక్వెల్ పూర్తి అయ్యే అవకాశాలు లేనందున, ఆ చిత్ర డైరెక్టర్ నాగ అశ్విన్ వేరే ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆయన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తాడట.
రీసెంట్ గానే ఆయన ముంబై కి వెళ్లి అలియా భట్ కి స్టోరీ వినిపించగా, ఆమె తెగ నచ్చేసింది, షూటింగ్ ని ఎప్పుడెప్పుడు మొదలు పెడదామా అనేంత ఆత్రుతతో ఎదురు చూస్తుందని సమాచారం. ప్రభాస్ నుండి అనుమతి ని తీసుకొని, వెంటనే ఈ సినిమాని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రభాస్(Rebel Star PRabhas) ఈ ఏడాది లోనే కల్కి సీక్వెల్ ని పూర్తి చేస్తాడు అంటూ వచ్చిన వార్తలన్నీ పక్కకి జరిగినట్టే. మరో ఏడాది వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే సూచనలే కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, హనురాఘవపూడి చిత్రాలను సమాంతరంగా చేస్తున్నాడు. ఇవి రెండు పూర్తి అవ్వగానే ఆయన స్పిరిట్ మూవీ షూటింగ్ కి షిఫ్ట్ అవుతాడు. స్పిరిట్ పూర్తి అయ్యాకనే కల్కి సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉంది. అప్పటి వరకు కల్కి మూవీ లవర్స్ ఎదురు చూడాల్సిందే.