Director Mukesh Kumar Singh: మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప(Kannappa Movie) చిత్రం మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై మొదటి నుండి ఆడియన్స్ కి కాస్త చిన్న చూపు ఉండేది. ఎందుకంటే ఇది మంచు కుటుంబానికి సంబంధించిన సినిమా కాబట్టి. మంచు విష్ణు మరియు మోహన్ బాబు గడిచిన రెండేళ్ల నుండి చేస్తూ వచ్చిన కొన్ని కామెంట్స్ కారణంగా వాళ్లపై సోషల్ మీడియా లో విపరీతమైన నెగటివిటీ పెరిగింది. దాని ప్రభావం కాస్త కన్నప్ప పై పడింది. కానీ ఎప్పుడైతే ఈ సినిమా నుండి ప్రమోషనల్ కంటెంట్ బయటకు రావడం మొదలైందో ‘అబ్బో..పర్లేదే..చాలా కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ఉన్నారు..శభాష్ విష్ణు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక థియేట్రికల్ ట్రైలర్ అయితే అందరినీ ఆకర్షించింది. సినిమాలో ఇంత విషయం ఉందని ఊహించలేదంటూ సోషల్ మీడియా లో ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేశారు.
Also Read: ‘కుబేర’ కి నాగార్జున,ధనుష్ కంటే శేఖర్ కమ్ముల ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడా..?
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ చిత్రంలో పని చేసిన ప్రభాస్(Rebel Star Prabhas), మోహన్ లాల్(Mohanlal),అక్షయ్ కుమార్(Akshay Kumar) వంటి వారు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోయారు కానీ, తమిళ నటుడు శరత్ కుమార్ మాత్రం పాల్గొన్నాడు. ఇక ఈ చిత్రానికి ముకేశ్ సింగ్ కుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. హిందీ లో ఈయన తెరకెక్కించిన ‘మహాభారతం’ సీరియల్ ని మనం అంత తేలికగా మర్చిపోగలమా?, తెలుగు లో స్టార్ మా ఛానల్ లో అప్పట్లో ప్రసారం అయ్యేది. ప్రతీ ఎపిసోడ్ ఒక అద్భుతమైన దృశ్య కావ్యం లాగా ఉంటుంది. ఆ రేంజ్ లో ఈ సీరియల్ ని తీర్చి దిద్దాడు కాబట్టే, మంచు విష్ణు ఏరికోరి ఆయన్ని ఈ చిత్రం కోసం తీసుకొచ్చాడు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముకేశ్ కుమార్(Mukesh Kumar Singh) మాట్లాడుతూ ‘గత రెండేళ్లుగా హైదరాబాద్ నా సొంత ఊరు అయిపోయింది. ఎన్నో అద్భుతమైన అనుభూతులు ఇక్కడ నాకు కలిగాయి. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ధన్యవాదాలు. మోహన్ బాబు లేకుంటే ఈ సినిమా అంత తేలికగా పూర్తి అయ్యేది కాదు. ఆయన కొబ్బరి కాయ లాంటి వాడు, పైకి చాలా కటువుగా కనిపిస్తాడు కానీ, మనసు వెన్న లాంటిది. అంతటి స్వచ్ఛమైన మనిషిని నేను ఈమధ్య కాలం లో ఎక్కడా చూడలేదు. విష్ణు లాంటి నటుడితో నేనిప్పటి వరకు పని చెయ్యలేదు. సాధారణంగా ఇలాంటి కఠినమైన సబ్జక్ట్స్ లో సన్నివేశాలు చేసేటప్పుడు ఒక నటుడు నాలుగైదు టేకులు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే పది కి పైగా టేకులు కూడా తీసుకునేవారు కూడా ఉన్నారు. కానీ విష్ణు కేవలం ఒకటి రెండు టేకులు మాత్రమే తీసుకున్నాడు. ఇక ప్రభాస్ తో కలిసి పని చేయడం కూడా ఒక మంచి అనుభూతి. అంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా ఆయన చాలా హంబుల్ గా ఉంటాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
