https://oktelugu.com/

Martin Movie : నా సినిమా విడుదలను ఆపేయండి అంటూ కోర్టు మెట్లు ఎక్కిన స్టార్ డైరెక్టర్..పాన్ ఇండియన్ సినిమాకి భారీ కష్టాలు!

సినిమాకి డైరెక్టర్ గా పనిచేసిన ఆయనే విలన్ గా మారిపోయాడు. తనకు న్యాయం చేయాలి, సినిమా విడుదలను ఆపేయాలి అంటూ హై కోర్టు మెట్లు ఎక్కాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ చిత్ర నిర్మాత ఉదయ్ మెహతా, దర్శకుడు ఏపీ అర్జున్ మధ్య గత కొంతకాలం గా పెద్ద యుద్ధమే నడుస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 4, 2024 / 08:04 PM IST

    Martin Movie

    Follow us on

    Martin Movie : యాక్షన్ కింగ్ అర్జున్ అంటే ఎవరో తెలియని వారంటూ ఉండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆయన తెలుగు, తమిళ ఆడియన్స్ కి సుపరిచితమే. హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా అర్జున్ తనకంటూ ఇండస్ట్రీ లో ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు. అర్జున్ సర్జా కుటుంబం నుండి కూడా ఒకరు హీరో గా ఇండస్ట్రీ లోకి వచ్చాడు, అతను ఇప్పుడు కన్నడ టాప్ లీడింగ్ స్టార్ హీరోలలో ఒకడు అనే విషయం చాలా మందికి తెలియదు. అర్జున్ మేనల్లుడిగా కన్నడ ఇండస్ట్రీ లోకి 2012 వ సంవత్సరం లో అడుగుపెట్టాడు ధృవ్ సర్జా. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈయన రీసెంట్ గా ‘మార్టిన్’ అనే పాన్ ఇండియన్ యాక్షన్ జానర్ చిత్రం లో నటించాడు. ఆరేళ్ళ క్రితం ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో షూటింగ్ ఆగడం, మళ్ళీ ప్రారంభం అవ్వడం,ఇలా జరుగుతూ ఉండేది.

    ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి డైరెక్టర్ గా పనిచేసిన ఆయనే విలన్ గా మారిపోయాడు. తనకు న్యాయం చేయాలి, సినిమా విడుదలను ఆపేయాలి అంటూ హై కోర్టు మెట్లు ఎక్కాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ చిత్ర నిర్మాత ఉదయ్ మెహతా, దర్శకుడు ఏపీ అర్జున్ మధ్య గత కొంతకాలం గా పెద్ద యుద్ధమే నడుస్తుంది. సినిమా బడ్జెట్ కి కేటాయించిన డబ్బులను డైరెక్టర్ ఏపీ అర్జున్ దుర్వినియోగం చేసారంటూ ఈ సినిమాకి VFX వర్క్ చేయడానికి ఒప్పందం చేసుకున్న ఒక ప్రముఖ సంస్థపై కేసు దాఖా చేస్తూ, దీనికి కారణం డైరెక్టర్ ఏపీ అర్జున్ కూడా అని పిటీషన్ లో పేర్కొన్నాడు నిర్మాత ఉదయ్. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలలో తన పేరు ని తొలగించారని డైరెక్టర్ ఏపీ అర్జున్ గొడవ చేసాడు. నిర్మాత ఉదయ్ దర్శకుడి పేరు లేకుండా ఈ సినిమాకి ప్రొమోషన్స్ చేసుకుంటున్నాడని, ఒప్పందాన్ని ఉల్లంఘించి దర్శకత్వం వహించిన తన పేరుని తొలగించినందుకు ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని ఆయన కోర్టుని ఆశ్రయించాడు. దీనిపై న్యాయ విచారణ జరగాల్సి ఉంది.

    నిర్మాత ఉదయ్ మెహతా కంప్యూటర్ గ్రాఫిక్స్, VFX వర్క్ చేయడానికి ఒక ప్రముఖ VFX కంపెనీ లో పనిచేస్తున్న ట్రైనర్ తో ఒప్పందం కుదిరించుకున్నాడు. అందుకోసం ఆయన ఆ కంపెనీ కి రెండు కోట్ల 50 లక్షలు కేటాయించాడు. కానీ కంపెనీ VFX వర్క్ ని పూరీతి చేయలేకపోయింది, చేసిన ఆ కాస్త పని కూడా నిర్మాతకు సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో కోపగించుకున్న ఉదయ్ ఆ సంస్థ అధినేతలైన సురేంద్ర రెడ్డి, సత్యా రెడ్డి లపై కేసు ఫిర్యాదు చేసాడు. ఆ తర్వాత డిజిటల్ ట్రైనర్ సురేంద్ర రెడ్డి మీడియా తో మాట్లాడుతూ నిర్మాత ఇచ్చిన డబ్బులతో డైరెక్టర్ ఏపీ అర్జున్ 50 లక్షల రూపాయిలు లంచం తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు. దీంతో నిర్మాత, డైరెక్టర్ మధ్య గొడవ తారాస్థాయికి జరిగింది. ఈ క్రమంలోనే నిర్మాత ఉదయ్ మెహతా డైరెక్టర్ ఏపీ అర్జున్ పేరు ని సినిమా నుండి తొలగించి ప్రొమోషన్స్ మొదలు పెట్టాడు.