https://oktelugu.com/

Bigg Boss Telugu 8 Sonia : నాగార్జున తీసుకునేవి మొత్తం తప్పుడు నిర్ణయాలే అంటూ ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ సోనియా సంచలన వ్యాఖ్యలు!

ఆమె మనసులోని మాటలు బయటకి వస్తే ఇంత చెత్తగా ఉంటాయా అని జనాలు ఫీల్ అయ్యారు కాబట్టే ఈరోజు ఆమె ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో అక్కినేని నాగార్జున గురించి, అలాగే బిగ్ బాస్ షో గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 4, 2024 / 08:13 PM IST

    Bigg Boss Telugu 8 Sonia

    Follow us on

    Bigg Boss Telugu 8 Sonia : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన నాలుగు వారాల్లోనే బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సోనియానే అని చెప్పొచ్చు. బిగ్ బాస్ హిస్టరీ లో ఇంతటి నెగటివిటీ సంపాదించుకున్న కంటెస్టెంట్ ఇంతకు ముందు ఎవరూ లేరు, బహుశా తదుపరి సీజన్స్ లో కూడా ఉండరేమో. హౌస్ లో ఈమె ఉన్నన్ని రోజులు చాలా బోల్డ్ గా ఉండేది. తన మనసులో అనిపించిన మాటలను అనిపించినట్టుగా చెప్పడంలో ఈమె దిట్ట. కానీ ఆమె మనసులోని మాటలు బయటకి వస్తే ఇంత చెత్తగా ఉంటాయా అని జనాలు ఫీల్ అయ్యారు కాబట్టే ఈరోజు ఆమె ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో అక్కినేని నాగార్జున గురించి, అలాగే బిగ్ బాస్ షో గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

    ఆమె మాట్లాడుతూ ‘నేను ఊహించిన బిగ్ బాస్ షో కాదు ఇది. నేను ఈ రియాలిటీ షోకి నా రియాలిటీ ని చూపించుకోవడం కోసం వచ్చాను. కానీ బయటకి వచ్చిన తర్వాత కొన్ని ఎపిసోడ్స్ చూసి ఆశ్చర్యపోయాను. నా కంటెంట్ మొత్తం ఎడిటింగ్ లో తీసి చూపించారు. జనాలకు నా గురించి చాలా చెడుగా ప్రొజెక్ట్ అయ్యేలా చూపించారు. ఒకటి కాదు, రెండు కాదు చాలా సంఘటనలు అలాంటివి ఉన్నాయి. ఉదాహరణకు ఒకరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలని ఎంతో ఇష్టం గా చేసుకున్నాను. కానీ నేను తినేలోపే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తినేసి చివర్లో మిగిలింది నాకు నిఖిల్ తో పంపించారు. నాకు ఆ విషయం లో చాలా కోపం వచ్చింది. ఆ క్రమం లో నిఖిల్ నాతో మాట్లాడేందుకు వచ్చినప్పుడు కనీసం నువ్వు తినేటప్పుడు అయినా నన్ను పిలవాలని అనిపించలేదా?, ఒక క్లాన్ చీఫ్ గా అందరూ తిన్నారా లేదా అనేది చూసుకోవడం నీ బాధ్యత అని అతనితో గొడవలు వేసుకున్నాను. దానిని మొత్తం ఎడిటింగ్ లో లేపేసి నేను నిఖిల్ తినేటప్పుడు పిలవలేదని, అందుకు అలిగినట్టుగా చూపించారు.

    వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు కూడా నిఖిల్ తో సోనియా అలిగింది అన్నట్టు చెప్పుకొచ్చారు. అది జనాలకు చాలా చెడుగా ప్రొజెక్ట్ అయ్యింది. ఒక హోస్ట్ సాహనం లో ఉన్న వ్యక్తి ఇవన్నీ చూసుకొని కదా మాట్లాడాలి. అలా ఆయనకీ అనిపించింది మాట్లాడేస్తే బయటకి వచ్చిన తర్వాత నేను ఎలాంటి పరిస్థితులు ఎదురుకోవాల్సి వస్తుందో ఆయన ఊహించలేకపోయారా?, హోస్ట్ గా తీసుకుంటే సరైన నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే సైలెంట్ గా ఉండాలి’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపింది. హోస్ట్ నాగార్జున పై హౌస్ నుండి బయటకి వచ్చిన ఏ కంటెస్టెంట్ కూడా ఇలా మాట్లాడలేదని, నువ్వు లైవ్ లో చేసిన పనులన్నీ బిగ్ బాస్ వాళ్ళు చూపించి ఉండుంటే నిన్ను జనాలు మొదటి వారం లోనే ఎలిమినేట్ చేసేవారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకొచ్చారు.