Prabhas – Hanu Raghavapudi movie : ప్రభాస్ స్పీడ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. తన తోటి స్టార్ హీరోలు మూడేళ్లకు ఒక సినిమా ప్రేక్షకులకు అందిస్తుంటే, ప్రభాస్ ఏడాదికి ఒక సినిమా చేస్తూ వస్తున్నాడు. ఆయన వల్ల ఇండస్ట్రీ ఎన్నో వందల కోట్ల రూపాయిలు లాభాలు వచ్చాయి, ఎన్నో వేల మందికి ఉపాధి కలిగింది. రీసెంట్ గానే ఆయన ‘కల్కి’ చిత్రం తో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడో మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని ఫుల్ రన్ లో 1000 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేతిలో ‘కల్కి 2’, ‘సలార్ 2’, ‘రాజా సాబ్’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు రీసెంట్ గానే ఆయన ‘సీత రామం’ డైరెక్టర్ హను రాఘవపూడి తో ఒక సినిమాని ని ప్రారంభించాడు. పీరియాడిక్ జానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా రజాకార్ ఉద్యమం నేపథ్యం లో సాగనుంది.
ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ద్వారకా లో మొదలై పెట్టి ఒక షెడ్యూల్ ని పూర్తి చేసారు. ఇక రెండవ షెడ్యూల్ కోసం ప్రభాస్ డేట్స్ అవసరం ఉన్నాయి. ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా ‘ఫౌజీ’ అని పెట్టారు. ఫౌజీ అంటే సైనికుడు, ఇండియన్ ఆర్మీ కి చెందిన ఒక యువకుడు కి , పాకిస్థాన్ యువతి కి మధ్య సాగే ప్రేమ కథ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ హను రాఘవపూడి. ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీ లో ఇప్పుడు హల్చల్ చేస్తున్న వార్త ఏమిటంటే, రీసెంట్ గానే షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఒక పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ చిత్రం అట్టకెక్కింది అని. రీసెంట్ గా మొదలైన పాన్ ఇండియన్ చిత్రం ఏదైనా ఉందా అంటే అది ఫౌజీ అనే చెప్పొచ్చు. హైదరాబాద్ లోని మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో ప్రారంభోత్సవం ని కూడా జరుపుకుంది.
కాబట్టి ఈ సినిమానే ఆగిపోయిందా అనే సందేహాలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకపక్క డైరెక్టర్ హను సమయం వృధా చేయకుండా, ప్రభాస్ లేని సన్నివేశాలు మొత్తం షూట్ చేస్తున్నాడనే వార్త వినిపిస్తుంది. దాంతో పాటు ఈ సినిమా షూటింగ్ ఆరంభం లోనే ఆగిపోయింది అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ రెండిట్లో ఏది నిజం అనేది మూవీ టీం రెస్పాన్స్ ఇస్తే కానీ తెలియదు. ఇది ఇలా ఉండగా ఫౌజీ తో పాటు, కేజీఎఫ్ హీరో యాష్ కొత్త చిత్రం ‘టాక్సిక్’ కూడా రెగ్యులర్ షూటింగ్ ని రీసెంట్ గానే మొదలు పెట్టుకుంది. కాబట్టి ఇండస్ట్రీ వర్గాల్లో తిరుగుతున్న ఆ రూమర్ ఈ చిత్రానికి కూడా వర్తించొచ్చేమో అని అనుకుంటున్నారు విశ్లేషకులు.