ఎంటర్టైన్మెంట్Monkey Man: దేవ్ పటేల్ డైరెక్షన్ లో ‘మంకీ మ్యాన్’.. ఏప్రిల్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల

Monkey Man: దేవ్ పటేల్ డైరెక్షన్ లో ‘మంకీ మ్యాన్’.. ఏప్రిల్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల

Monkey Man: హాలీవుడ్ కథానాయకుడు దేవ్ పటేల్ దర్శకత్వంలో డెబ్యూ చేస్తున్న చిత్రం ‘ మంకీ మ్యాన్’. ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. దేవ్ పటేల్ నటిస్తూ డైరెక్ట్ చేసిన మంకీ మ్యాన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిందని ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఇప్పటివరకు హీరోగా ఉన్న దేవ్ పటేల్ తొలిసారిగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

పేదవాళ్లను కాపాడే హీరోగా తనను తాను భావించే ఓ వ్యక్తి హనుమంతుడిని స్ఫూరిగా తీసుకుని తన జీవితంలో ఎలా ముందుకు వెళ్లాడనే అంశంతో మంకీ మ్యాన్ చిత్రం తెరకెక్కింది. ‘ నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఒక కథ చెప్పేది’ అంటూ కథనాయకుడు డైలాగ్ చెప్పడంతో మూవీ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.

రాక్షస రాజు తన సైన్యంతో కలిసి ప్రజలను భయపెట్టేవారు. అప్పుడు ప్రజల రక్షకుడు ఎదురవుతాడు. అతనే ది వైట్ మంకీ అని హీరో డైలాగుతో తేల్చి చెబుతాడు. పెద్ద పెద్ద నగరాల్లో నివసించే ప్రజలను ఎవరూ పట్టించుకోరని, అటువంటి వారికి గుర్తింపు కోసం ఫైట్ చేసుందుకు మంకీ మ్యాన్ ముందుకు రావడం, ఆ తరువాత ఏం చేస్తాడు అనే అంశంపై చిత్రం నిర్మితమైంది. వెయిటర్ పాత్రలో కనిపించే దేవ్ పటేల్ రాత్రి సమయంలో ముసుగు గొర్రిల్లా తరహాలో ముసుగు ధరించి రాక్షసులపై ఏ విధంగా యుద్ధం చేశాడో ఈ చిత్రంలో కనిపిస్తుందని తెలుస్తోంది.

మంకీ మ్యాన్ చిత్రంలో దేవ్ పటేల్ సరసన తెలుగు నటి శోభితా దూళిపాళ నటిస్తోంది. మకరంద్ దేశ్ పాండే, సిఖందర్ ఖేర్, విపిన్ శర్మ, అశ్విని కల్సేకర్ వంటి నటీనటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మంకీమ్యాన్ హీరోగా, దర్శకుడిగా వ్యవహారించిన దేవ్ పటేల్ నిర్మాతలతో కలిసి తాను కూడా ప్రొడక్షన్ లో భాగస్వామిగా మారారు. యూనివర్సల్ పిక్చర్స్ బ్యానర్ లో మంకీ మ్యాన్ మూవీ ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.

 

Monkey Man | Official Trailer

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Monkey Man : దేశంలో ఇప్పుడీ మంకీ మ్యాన్ గురించే చర్చ.. అవలీలగా ఎక్కేస్తున్నాడు? ఎవరీయన.. ఏంటా కథ?

చాలా మందికి ఎత్తులంటే భయం. కొంత ఎత్తు ఎక్కిన తర్వాత వారికి కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. రెండు మూడు అంతస్తుల భవనం మీద నుంచి చూసేందుకు కూడా తెగ భయపడుతుంటారు.

Monkey Man : సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన మంకీ మాన్… ఆ పాత్రలో ఆ తెలుగు హీరోయిన్!

ఓ ఇంటర్వ్యూలో ఆమె మంకీ మాన్ లో పాత్రపై స్పందించడం విశేషం. సీత అనే వేశ్య పాత్రలను హాలీవుడ్ ఆడియన్స్ ఆదరించారు. ఇండియన్ ఆడియన్స్ సైతం ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Exit mobile version