Monkey Man: హాలీవుడ్ కథానాయకుడు దేవ్ పటేల్ దర్శకత్వంలో డెబ్యూ చేస్తున్న చిత్రం ‘ మంకీ మ్యాన్’. ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. దేవ్ పటేల్ నటిస్తూ డైరెక్ట్ చేసిన మంకీ మ్యాన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిందని ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఇప్పటివరకు హీరోగా ఉన్న దేవ్ పటేల్ తొలిసారిగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
పేదవాళ్లను కాపాడే హీరోగా తనను తాను భావించే ఓ వ్యక్తి హనుమంతుడిని స్ఫూరిగా తీసుకుని తన జీవితంలో ఎలా ముందుకు వెళ్లాడనే అంశంతో మంకీ మ్యాన్ చిత్రం తెరకెక్కింది. ‘ నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఒక కథ చెప్పేది’ అంటూ కథనాయకుడు డైలాగ్ చెప్పడంతో మూవీ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.
రాక్షస రాజు తన సైన్యంతో కలిసి ప్రజలను భయపెట్టేవారు. అప్పుడు ప్రజల రక్షకుడు ఎదురవుతాడు. అతనే ది వైట్ మంకీ అని హీరో డైలాగుతో తేల్చి చెబుతాడు. పెద్ద పెద్ద నగరాల్లో నివసించే ప్రజలను ఎవరూ పట్టించుకోరని, అటువంటి వారికి గుర్తింపు కోసం ఫైట్ చేసుందుకు మంకీ మ్యాన్ ముందుకు రావడం, ఆ తరువాత ఏం చేస్తాడు అనే అంశంపై చిత్రం నిర్మితమైంది. వెయిటర్ పాత్రలో కనిపించే దేవ్ పటేల్ రాత్రి సమయంలో ముసుగు గొర్రిల్లా తరహాలో ముసుగు ధరించి రాక్షసులపై ఏ విధంగా యుద్ధం చేశాడో ఈ చిత్రంలో కనిపిస్తుందని తెలుస్తోంది.
మంకీ మ్యాన్ చిత్రంలో దేవ్ పటేల్ సరసన తెలుగు నటి శోభితా దూళిపాళ నటిస్తోంది. మకరంద్ దేశ్ పాండే, సిఖందర్ ఖేర్, విపిన్ శర్మ, అశ్విని కల్సేకర్ వంటి నటీనటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మంకీమ్యాన్ హీరోగా, దర్శకుడిగా వ్యవహారించిన దేవ్ పటేల్ నిర్మాతలతో కలిసి తాను కూడా ప్రొడక్షన్ లో భాగస్వామిగా మారారు. యూనివర్సల్ పిక్చర్స్ బ్యానర్ లో మంకీ మ్యాన్ మూవీ ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.
