https://oktelugu.com/

Tollywood Heroine : ఆ పనిలోకి మారిన తెలుగు హీరోయిన్… చాలా ఎంజాయ్ చేస్తారంటూ క్రేజీ కామెంట్స్

మంకీ మాన్ లో సీత అనే వేశ్య పాత్రలో కనిపించడం నాకు చాలా ఆనందం కలిగించింది. అమెరికన్ ఆడియన్స్ నా పాత్రను ఎంజాయ్ చేశారు. అలాగే మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆమె అన్నారు. త్వరలో మంకీ మాన్ తెలుగులో విడుదల కానుంది.

Written By:
  • NARESH
  • , Updated On : April 14, 2024 / 09:52 AM IST
    Follow us on

    Tollywood Heroine : తెలుగు హీరోయిన్ వేశ్యగా మారింది. అయితే నిజ జీవితంలో కాదు లెండి . ఒక సినిమాలో. ఆమె ఎవరో కాదు శోభిత దూళిపాళ్ల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల తెనాలిలో పుట్టిన శోభిత మోడల్ గా కెరీర్ ఆరంభించింది. పలు బ్రాండ్స్ కి ఆమె ప్రచార కర్తగా వ్యవహరించింది. 2016లో విడుదలైన రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఆమె కెరీర్ బాలీవుడ్ లో మొదలైంది.

    sobhita_monkey_man_pic

    అనంతరం చెఫ్, కలాకండి వంటి హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం గూఢచారి. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ లో శోభిత హీరోయిన్ గా నటించింది. గూఢచారి హిట్ కావడం విశేషం. అడివి శేష్ మరో చిత్రం మేజర్ లో సైతం శోభిత దూళిపాళ్ల ఓ కీలక రోల్ చేసింది. మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వం సిరీస్ లో శోభిత నటించడం విశేషం.

    మరోవైపు ఆమె బాలీవుడ్ లో కూడా నటిస్తుంది. ఆమె లేటెస్ట్ మూవీ మంకీ మ్యాన్ యూఎస్ లో ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో ఆమె వేశ్య పాత్ర చేయడం విశేషం. మంకీ మాన్ లో సీత అనే వేశ్య పాత్రలో కనిపించడం నాకు చాలా ఆనందం కలిగించింది. అమెరికన్ ఆడియన్స్ నా పాత్రను ఎంజాయ్ చేశారు. అలాగే మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆమె అన్నారు. త్వరలో మంకీ మాన్ తెలుగులో విడుదల కానుంది.

    కాగా హీరో నాగ చైతన్యతో శోభిత ఎఫైర్ నడుపుతున్నారనే వాదన ఉంది. విదేశాల్లో చక్కర్లు కొడుతూ ఒకటి రెండుసార్లు వీరు కెమెరా కంటికి చిక్కారు. లండన్ లో ఓ ఇండియన్ రెస్టారెంట్ కి శోభిత, నాగ చైతన్య వెళ్లారు. అక్కడి చెఫ్ నాగ చైతన్యతో సెల్ఫీ తీసుకున్నాడు. సదరు సెల్ఫీ లో దూరంగా శోభిత ఉంది. దాంతో నాగ చైతన్య-శోభిత మధ్య ఎఫైర్ నడుస్తోందన్న మాట వాస్తవమే అని కొందరు భావిస్తున్నారు.