బిజినెస్7 Seater Car: రూ.10 లక్షల లోపు వచ్చే 7 సీటర్ కార్లు ఇవే..

7 Seater Car: రూ.10 లక్షల లోపు వచ్చే 7 సీటర్ కార్లు ఇవే..

7 Seater Car: కారు కొనాలనుకునేవారు మొన్నటి వరకు చిన్న కారు ఉంటే సరిపోయేది అనుకున్నారు. దీంతో హ్యాచ్ బ్యాక్ కార్ల కోసం సెర్చ్ చేసేవారు. కానీ ఇప్పుడు విశాలమైన కారుతో పాటు ఇంజిన్ పవర్ ఎక్కువగా ఉండే 7 సీటర్ వెహికల్ కోసం ఆరాటపడుతున్నారు. హ్యాచ్ బ్యాక్ కార్ల కంటే ఇందులో బూట్ స్పేస్ ఎక్కువగా ఉండడంతో విశాలంగా ఉండడంతో ధర కాస్త కాస్ట్లీగానే ఉంటుందని అనుకుంటారు. కానీ కొన్ని కంపెనీలు మిడిల్ క్లాప్ పీపుల్స్ కు అనుగుణంగా కార్లను ఉత్పత్తి చేసి సరసమైన ధరకే విక్రయిస్తున్నారు. అంటే కేవలం రూ.10 లక్షల లోపు ఈ కారును ఇంటికి తెచ్చుకోవచ్చంటున్నారు. ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

దేశీయ మార్కెట్లో మారుతి సుజుకీ నెంబర్ వన్ గా నిలస్తుంది. వినియోగదారుల అభిరుచులను బట్టి మోడళ్లను తయారు చేస్తుంది. ఈ తరుణంలో తక్కువ ధరకు 7 సీటర్ కారును అందించాలన్న ఉద్దేశంతో ఎర్టిగా(Ertiga)ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మారుతి ఎర్టిగా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 102 బీహెచ్ పీ పవర్, 136.8 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్, 6 స్పీడ్ టార్క్ కన్వర్ట్ తో పాటు ఆటోమేటిక్ గేర్ కూడా సౌకర్యంగా ఉంటుంది. దీనిని రూ.8.64 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.10.29 లక్షలతో విక్రయిస్తున్నారు.

మారుతి లాంటి కార్లతో పోటీ పడుతోంది రెనాల్ట్. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన డస్టర్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలిసిందే. ఈ కంపెనీ నుంచి ట్రైబర్ 7 సీటర్ ను కలిగి ఉంది. ఇది కాంపాక్ట్ ఎంపీవీగా ఉండి 5 స్ీపడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. 71 బీహెచ్ పీ పవర్, 96 ఎన్ ఎం టార్క్ ను ఉతప్పతి చేసే ఈ కారు రూ.6.34 ప్రారంభ ధరతో ఉంది. SUV కార్లను కోరుకుంటున్న వారిలో మహీంద్రా కార్లను బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. ఈ కంపెనీకి చెందిన బొలెరో నియో 1.5 లీటర్ డీజిల్ తో పాటు 99 బీహెచ్ పీ పవర్, 260 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు రూ.9.63 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

నేటి కాలంలో కుటుంబ సభ్యులంతా ఒకేసారి విహార యాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నారు. అలాగే కొన్ని పనుల కారణంగా ప్రయాణాలు చేయాల్సి వస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందువల్ల 7 సీటర్ కార్లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి వారికి తక్కువ ధరలో 7 సీటర్ కారును కొనుగోలు చేయాలనుకుంటే పై కార్లు సౌకర్యాంగా ఉంటాయి.

 

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Top 10 Car Sales June 2026: మారుతి సుజుకి కార్లకు చెక్.. టాప్ లోకి ఈ బలమైన కార్లు.. జూన్లో టాప్ అమ్మకాలు ఇవే…

Top 10 Car Sales In June 2026: భారత ఆటోమోబైల్ మార్కెట్లో జూన్ నెలలో కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ తన కార్లతో మార్కెట్‌లో ఆధిపత్యం చాటింది. దేశవ్యాప్తంగా...

Mahindra XUV700: 7 సీటింగ్, పవర్ఫుల్ ఇంజిన్.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్.. ఇప్పటికే 3లక్షల మంది కొన్నారు

Mahindra XUV700: భారత్ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యధిక కార్లను విక్రయించే కంపెనీలలో మహీంద్రా ఒకటి. ఇప్పుడు ఈ వాహన తయారీ సంస్థకు చెందిన XUV700 కారు భారతదేశంలో 3 లక్షల యూనిట్ల అమ్మకాల...

Most Popular

Tata Avinya X: ఈ టాటా కారు డిజైన్ గురించి తెలిస్తే క్యూ కట్టకుండా ఉండరు..

Tata Avinya X: భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక 'టాటా అవిన్యా ఎక్స్' ఈవీ కారును భారత రోడ్లపై రోడ్ టెస్టింగ్...

Honor X7e Plus 5G: ఈ ఫోన్ ఎక్కువ సేపు చూసినా కళ్లకు అలసట కలగదు.. ఎందుకంటే..

Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ 'ఎక్స్ సిరీస్'లో భాగంగా 'హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది....

Mahindra Vision T: మహీంద్రా మరో సంచలనం.. విజన్.T కి భారత్‌లో పేటెంట్.. ఇది ఎలా ఉండబోతుందంటే..

Mahindra Vision T: SUV కార్లను తీసుకురావడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లతో అలరించిన ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ విషయంలోనూ తనదే...

Jio: జియో వాడుతూ మనం కంపెనీకి ఎంత నెల ఇస్తున్నామో తెలుసా

Jio: రిలయన్స్‌ లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ సంస్థ అధినేత అనిల్‌ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడు. రిలయన్స్‌ సంస్థ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసిక...

OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి OnePlus ఎగ్జిట్.. మరి భారత్ లో..

OnePlus : ప్రముఖ మొబైల్ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మార్కెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన 'ఒప్పో' (Oppo) తన గ్లోబల్ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో...
Exit mobile version