Monkey Man: ఇండియాలో మరోసారి వాయిదా పడిన మంకీ మ్యాన్..? కారణం ఏంటి?

శోభితా ధూళిపాల నటించిన సినిమా మంకీ మ్యాన్. ఈ సినిమాకు దేవ్ పటేల్ దర్శకత్వం వహించారు. విపిన్ శర్మ, మకరంద్ దేశ్ పాండే, కోప్లీలు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.

Written By: Swathi Chilukuri, Updated On : April 6, 2024 4:05 pm

Monkey Man

Follow us on

Monkey Man: ఇతరులను ఇబ్బంది పెట్టేలా, మతానికి అతీతంగా ఉన్నా, ఇబ్బంది పెట్టే విధంగా సినిమాలు ఉన్నా.. వాటికి అనుమతి రావడం కష్టమే. ఇలాంటి సినిమాలు చాలానే ఉంటాయి. ప్రస్తుతం ఒక సినిమాకు ఇండియాలో అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎందుకు మళ్లీ వాయిదా పడింది? అనే వివరాలు తెలుసుకుందాం.

శోభితా ధూళిపాల నటించిన సినిమా మంకీ మ్యాన్. ఈ సినిమాకు దేవ్ పటేల్ దర్శకత్వం వహించారు. విపిన్ శర్మ, మకరంద్ దేశ్ పాండే, కోప్లీలు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. తల్లి మరణానికి కారణమైన అవినీతి నేతలను పట్టుకోవడానికి కుమారుడు చేసే ప్రయత్నమే ఈ మంకీ మ్యాన్. ఈ క్రమంలోనే నిరుపేదలకు, అణగారిన వర్గాలకు హీరోగా మారతాడు హీరో. అయితే ఈ సినిమా తెరకెక్కించడానికి ముందుగా డైరెక్టర్ వెనకడుగు వేశారట, కానీ తర్వాత మళ్లీ తానే స్వయంగా ముందుకు వచ్చాను అని గతంలో చెప్పారు.

మంకీ మ్యాన్ భారతదేశంలో మరోసారి వాయిదా పడింది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయినా మంకీ మ్యాన్ భారతదేశంలో మాత్రం వాయిదా పడుతూనే వస్తుంది. ఈ సినిమా మరోసారి వాయిదా పడటానికి కారణం లేకపోలేదు. తీవ్రమైన హింస, లైంగిక సన్నివేశాలు, హిందూ మతం, పురాణాలకు సంబంధించిన సన్నివేశాలే సినిమా రిలీజ్ ను వాయిదా పడేలా చేస్తున్నాయట. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మరోసారి రిజెక్ట్ చేసింది.

లయన్, స్లమ్ డాగ్, మిలియనీర్ వంటి సినిమాలతో భారతీయ ప్రేక్షకులకు దగ్గరైన దేవ్ పటేల్.. ఇప్పుడు మంకీ మ్యాన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యారు. కానీ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఈ సినిమాకు అడ్డు అవుతున్నాయి. ఇదిలా ఉంటే భారతదేశ పురాణ, ఇతిహాసాలను వింటూనే తాను పెరిగినట్టు పేర్కొన్నారు దేవ్ పటేల్.