DilRaju RamCharan Controversy: ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) ‘గేమ్ చేంజర్'(Game Changer) ఫ్లాప్ తర్వాత ఆయన ప్రవర్తనలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు నిజాయితీ కూడా తన తర్వాతే పుట్టింది, కేవలం నిజాలే మాట్లాడుతాను అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ‘శాకుంతలం’ చిత్రం ఎడిటింగ్ రూమ్ లో చూసి ఎదో ఇండస్ట్రీ హిట్ కొట్టినట్టు సంతోషపడుతూ ఒక ఫేక్ ఎమోషన్స్ తో వీడియో ని విడుదల చేసిన దిల్ రాజు లో ఇంత గొప్ప మార్పు ఏంటి?, ఒక్క ఫ్లాప్ మనిషిని ఇంతలా మార్చేస్తుందా?, నిజంగా వండర్ అని పాపం అమాయక నెటిజెన్స్ అనుకుంటున్నారు. కానీ ఆయనలో ఈ ఆకస్మిక మార్పులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) డేట్స్ గురించి అని జరిగిన సంఘటనలను మొత్తం కనెక్ట్ చేసి చూస్తే అర్థం అవుతుంది. అందుకోసమే రామ్ చరణ్ మీద నోటికి వచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నాడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.
Also Read: చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న మరో సీనియర్ హీరోయిన్…
రీసెంట్ గానే దిల్ రాజు సోదరుడు శిరీష్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ అభిమానులు దిల్ రాజు గ్యాంగ్ ని సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ఉతికి ఆరేయడంతో సాయంత్రం లోపు క్షమాపణలు చెప్తూ ఒక బహిరంగ లేఖ ని విడుదల చేసాడు శిరీష్. ఇదంతా పక్కన పెడితే శిరీష్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతాడు. ఆర్య సినిమా సమయం లో ఆయన విడుదలయ్యే వరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు,ఈరోజు ఇంత పెద్ద స్టార్ అయ్యేదంటే ఇలాంటి లక్షణాలు ఉండడం వల్లే అని పెద్ద గొప్పలు చెప్పుకొచ్చాడు. కానీ రామ్ చరణ్ చేసిన మేలుని మాత్రం సునాయాసంగా మర్చిపోయాడు. ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని ఊపేసిన చిత్రం #RRR.
ALso Read: దెబ్బకు కాలభేరం.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన దిల్ రాజు సోదరుడు!
ఆస్కార్ వరకు వెళ్లిన సినిమా తర్వాత మూడేళ్లు కష్టపడి చేసిన ‘గేమ్ చేంజర్’ విడుదల అవుతున్న సీజన్ లో, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని కూడా విడుదల చేసుకుంటాము అంటే రామ్ చరణ్ ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా ఒప్పుకున్నాడు. ఏ పాన్ ఇండియన్ స్టార్ హీరో అయినా ఇలా ఒప్పుకుంటాడా?, ఒకవేళ రామ్ చరణ్ ఒప్పుకోకపోయుంటే ఏమయ్యేది?, దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం ని విడుదల చేసుకునేవాడా?, నష్టాల నుండి తప్పించుకునేవాడా?. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే శిరీష్ దీని గురించి మొన్నటి ఇంటర్వ్యూ లో ఒక్క మాట మాట్లాడలేదు. అతని సంగతి అలా ఉంచితే దిల్ రాజు కూడా జనవరి నెల నుండి ఇప్పటి వరకు ఈ విషయం గురించి మాట్లాడలేదు. అభిమానుల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఇప్పుడు చెప్తున్నాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి?, ఇదంతా అల్లు అర్జున్ డేట్స్ కోసం కాకా పెట్టడానికే కదా అని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం దిల్ రాజు కి స్టార్ హీరోలెవ్వరూ కూడా డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ఇది వాస్తవం. భవిష్యత్తులో రామ్ చరణ్ ఇతనితో సినిమా చేయడం కలే. అల్లు అర్జున్ అయినా డేట్స్ ఇస్తాడో లేదో చూడాలి.