Dil Ruba Collections: ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) , ‘డాకు మహారాజ్'(Daaku Maharaj) చిత్రాలు కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడంతో, ఇక నుండి వచ్చే టాలీవుడ్ సినిమాలు కూడా ఇలాగే సక్సెస్ అవుతాయి, ఈ ఏడాది ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది అని ట్రేడ్ చాలా ఆశపడింది. ఆ ఆశకు తగ్గట్టుగానే ఫిబ్రవరి నెలలో ‘తండేల్'(Thandel Movie), ‘డ్రాగన్'(Dragon Movie) వంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. కానీ అదే నెలలో వచ్చిన ‘లైలా'(Laila Movie) చిత్రం కమర్షియల్ గా ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాని మించి ఫ్లాప్ ని మళ్లీ ఈ ఏడాది లో చూడలేము ఏమో అని అనుకుంటున్న సమయంలో నేనున్నా నాయనమ్మ అంటూ వచ్చేసాడు మన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దిల్ రూబ'(Dilruba Movie), ‘లైలా’ కంటే ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది.
Also Read: సితారకు ఇష్టమైన ఈ తరం హీరోయిన్స్ ఎవరో తెలుసా? ఇక హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?
‘లైలా’ చిత్రం కనీసం వీకెండ్ వరకు బుక్ మై షో లో 5 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతూ పర్వాలేదు అనిపించుకుంది. కానీ ‘దిల్ రూబ’ చిత్రానికి రెండవ రోజు నుండే బుక్ మై షో ట్రెండింగ్ నుండి వైదొలగింది. రోజుకి కనీసం 5 వేల టిక్కెట్లు కూడా అమ్ముడుపోవడం లేదట. ‘క’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత విడుదల అవుతున్న సినిమా కావడంతో కనీసం ఓపెనింగ్స్ అయినా ఉంటాయని అనుకున్నారు బయ్యర్స్. ఆ ఉద్దేశ్యంతోనే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు. కానీ మొదటి రోజు కేవలం 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇక రెండవ రోజు అయితే ప్రపంచవ్యాప్తంగా కేవలం 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే సొంతం చేసుకుంది. అంటే షేర్ 30 లక్షల రూపాయిలు కూడా ఉండదు అన్నమాట. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
మొదటి రోజు రెండు నుండి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే సత్తా ఉన్న హీరో సినిమాకు, రెండు రోజులకు కలిపి కూడా కోటి రూపాయిల షేర్ రాలేదంటే ఈ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఆదివారం రోజు అయినా కనీస స్థాయిలో గ్రోత్ ఉంటుందని ఆశించారు మేకర్స్. కానీ ఆదివారం రోజున రెండవ రోజు కంటే దారుణమైన వసూళ్లను నమోదు చేసుకుంది. ఇది నిర్మాతకు మామూలు దెబ్బ కాదు. ‘క’ లాంటి విన్నూతన సినిమా తర్వాత విడుదల అవ్వాల్సిన చిత్రమైతే ఇది కాదు. అంతటి డిఫరెంట్ సబ్జెక్టు తో సినిమాని తీసి ప్రశంసలను అందుకున్న కిరణ్ అబ్బవరం, మళ్లీ రొటీన్ సబ్జెక్టు ని ఎంచుకోవడం ఏంటో అని ఆయన్ని అభిమానించే వారు పెదవి విరుస్తున్నారు.
Also Read: మహేష్ బాబు తో పోటీ పడి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న హీరోలు వీళ్లేనా..?