https://oktelugu.com/

Sitara : సితారకు ఇష్టమైన ఈ తరం హీరోయిన్స్ ఎవరో తెలుసా? ఇక హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

Sitara  : మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని తనకు ఇష్టమైన హీరోయిన్స్ ఎవరో వెల్లడించింది. అలాగే ఫేవరేట్ హీరో పేరు కూడా చెప్పింది. వారు ఎవరో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : March 16, 2025 / 02:14 PM IST
    Mahesh Babu Daughter Sitara

    Mahesh Babu Daughter Sitara

    Follow us on

    Sitara  : సితార సోషల్ మీడియా స్టార్. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురుగానే కాకుండా ఆమెకంటూ సపరేట్ ఇమేజ్ ఉంది. పసిప్రాయంలోనే సితార యూట్యూబ్ స్టార్ట్ చేసింది. మట్టి వినాయకుడు వంటి సోషల్ అవేర్నెస్ వీడియోలు చేసేది. ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత మంది ఫాలోవర్స్ సీతారకు ఉన్నారు. ఫ్యామిలీ ట్రిప్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. అలాగే తాను డాన్స్ చేసి వీడియోలు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంది.

    Also Read : ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తప్పుకున్న శ్రీలీల? కారణం ఇదేనా?

    సితార ఓ ఇంటర్నేషనల్ జ్యువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా చేయడం విశేషం. ఈ యాడ్ న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో ప్రదర్శించారు. ఇది సితారకు దక్కిన అరుదైన గౌరవం. మహేష్ బాబు ఎంతో ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడు. ఈ యాడ్ లో నటించినందుకు సితార కోటి రూపాయలు తీసుకుందట. అదొక రికార్డు అని చెప్పొచ్చు. ఈ డబ్బును సితార సామాజిక సేవకు ఖర్చు చేసింది. తండ్రి వలె మంచి హృదయం ఉన్న అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. పసిప్రాయంలోనే ఆమెకున్న సామాజిక స్పృహ చూస్తే ముచ్చటేస్తుంది.

    సితార ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన హీరో, హీరోయిన్స్ పేర్లు చెప్పింది. మీ అమ్మానాన్న కాకుండా నీకు ఇష్టమైన హీరో, హీరోయిన్ ఎవరని అడగ్గా… నాకు రష్మిక మందాన, శ్రీలీల అంటే ఇష్టమని చెప్పింది. వీరిద్దరూ మహేష్ బాబుతో నటించిన సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా చేసింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఇక త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీలో శ్రీలీలతో మహేష్ బాబు జతకట్టాడు. ఈ మూవీ పర్లేదు అనిపించుకుంది.

    ఇక తన ఫేవరేట్ హీరో మాత్రం ఎప్పటికీ తన తండ్రి మహేష్ బాబు మాత్రమే అని చెప్పింది. సితార గతంలో చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సితారకు మేకప్ వేసుకోవడం అంత ఇష్టం ఉండదు అట. ఎప్పుడైనా వాళ్ళ అమ్మ మేకప్ సామాగ్రిని వాడుకుంటుందట. సితార డాన్స్ కూడా నేర్చుకుంటుంది. ఆమె భవిష్యత్ లో హీరోయిన్ అయ్యే అవకాశం లేకపోలేదు. నమ్రత, మహేష్ బాబును చూస్తూ పెరిగిన తనకు నటన పట్ల ఆసక్తి ఉందని కూడా సితార ఓపెన్ అయ్యింది.

    Also Read : కన్నప్ప స్వగ్రామం వెళ్లిన మంచు విష్ణు… గ్రామ ప్రజలకు కీలక హామీ!