Mahesh Babu
Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కి చాలా మంచి ఇమేజ్ అయితే ఉంది. ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్బంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. అందుకే ఆయన నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సైతం తన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళితో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక రాజమౌళి సినిమా అంటే ఆటోమేటిగ్గా అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. కాబట్టి ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి.
Also Read :గౌతమ్ మొదటి సినిమాలో మహేష్ బాబు కూడా నటిస్తాడా..? తన సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్న సూపర్ స్టార్…
మరి వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మహేష్ బాబు పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు. కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రభాస్, అల్లుఅర్జున్ లాంటి హీరోలు సైతం పాన్ వరల్డ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్(Prabhas) ఫౌజీ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో చేయబోతున్న స్పిరిట్ (Spirit) సినిమాతో పాన్ వరల్డ్ ఇండస్ట్రీని టచ్ చేయాలని చూస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ (Allu Arjun) సైతం ఎప్పుడు అట్లీ తో చేస్తున్న సినిమా విషయంలో అదే వైఖరిని పాటిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా ఈ స్టార్ హీరోలందరిలో ఎవరూ పాన్ వరల్డ్ లో భారీ రికార్డులను కొల్లగొడతారు.
తద్వారా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి మహేష్ బాబుకు పోటీగా మారుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…మరి రాజమౌళి మహేష్ బాబుల సినిమా ముందు వీళ్ళ సినిమాలు నిలబడతాయా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : సితారకు ఇష్టమైన ఈ తరం హీరోయిన్స్ ఎవరో తెలుసా? ఇక హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?