https://oktelugu.com/

Dil Raju : భారీ మల్టీస్టారర్ సినిమా చేయనున్న దిల్ రాజు..!

Dil Raju : ఇప్పటి వరకు చాలా మంది హీరోలు, దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు...

Written By: , Updated On : March 24, 2025 / 11:07 AM IST
Follow us on

Dil Raju : ఇప్పటి వరకు చాలా మంది హీరోలు, దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు… దానికి తగ్గట్టుగానే పాన్ ఇండియాలో కూడా సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ లను సాధిస్తున్నారు. దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ మాత్రం కేవలం తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు…పాన్ ఇండియా సినిమాలు చేసిన అడపాదడపా చేస్తున్నాడు తప్పితే కంటిన్యూస్ గా తీయడం లేదు…

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలకు పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే ఉంది. ఇక మన సినిమాలు భారీ రేంజ్ లో సక్సెస్ లను సాధిస్తూ పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తుండటంతో ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు మన హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువగా అసక్తి చూపిస్తున్నారు. కారణం ఏంటంటే మన హీరోలతో సినిమాలు చేస్తే వాళ్ళకి భారీ గుర్తింపు రావడమే కాకుండా ఇండస్ట్రీ లో మంచి ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్న వారవుతారు. అందువల్లే మన హీరోల మీద కన్నేస్తున్నారు. ఇక గత సంవత్సరం మార్కో సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ‘హనీఫ్ అదేని’ డైరెక్షన్ లో దిల్ రాజు ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు దిల్ రాజు బ్యానర్ లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’,’ఎఫ్ 2′ లాంటి మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలు ఫ్యామిలీ కామెడీ ప్రధానంగా సాగిన సినిమాలు కావడంతో వీటికి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ అయితే లభించింది.

Dil Raju : భారీ మల్టీస్టారర్ సినిమా చేయనున్న దిల్ రాజు..!

Dil Raju : భారీ మల్టీస్టారర్ సినిమా చేయనున్న దిల్ రాజు..!

Dil Raju  హీరోలు ఎవరంటే..?

Also Read : అనిల్ రావిపూడి చిరంజీవి కి పోటీగా వస్తున్న దిల్ రాజు… వచ్చే సంక్రాంతికి రచ్చ రచ్చే…

ఇక హనీఫ్ చేసిన మార్కో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చింది. కాబట్టి తను చేయబోయే మల్టీ స్టారర్ సినిమా కూడా అదే జానర్ లో రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే దిల్ రాజుకి కథ వినిపించి ఫైనల్ కూడా చేసుకున్నాడట. అయితే దిల్ రాజు మాత్రం ఈ సినిమాను ఎవరితో చేయాలి అనే ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది.

అయితే ఇద్దరు తెలుగు హీరోలతో ఈ సినిమా చేస్తే ఈ మూవీని కేవలం తెలుగుకి మాత్రమే పరిమితం చేయాలని చూస్తున్నాడట… అలా కాకుండా తెలుగు నుంచి ఒక హీరో ఇతర భాషల నుంచి మరొక హీరో కనక చేసినట్టయితే దీనిని పాన్ ఇండియా సినిమాగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయట. మరి ఆయన ఈ సినిమాను ఎవరితో తీయబోతున్నాడు, ఎలా చేయబోతున్నాడు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ఇప్పటి వరకు దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ మినిమం గ్యారంటీ సినిమాలు కావడం విశేషం… వాళ్ల బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఆ మూవీ కోసం ప్రేక్షకులందరు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఆయన బ్యానర్ నుంచి మరోసారి మల్టీస్టారర్ సినిమా వస్తుంది అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు…

Also Read : గేమ్ ఛేంజర్ నష్టాలను సంక్రాంతికి వస్తున్నాం బ్యాలన్స్ చేసిందా?… దిల్ రాజు సమాధానం ఇదే!