Digital Revenue : గత పదేళ్లలో ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పెను మార్పులకు గురైంది. ప్రేక్షకుల అభిరుచి, కంటెంట్ సెలక్షన్, సినిమాను చూసే విధానం మారిపోయింది. ముఖ్యంగా కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ థియేట్రికల్ బిజినెస్ ని తీవ్రంగా దెబ్బ తీసింది. నెలల తరబడి థియేటర్స్ మూతబడ్డాయి. ఈ సమయంలో ఇంటికే పరిమితమైన ప్రేక్షకులు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ కి అలవాటు పడ్డారు. జాతీయ, అంతర్జాతీయ ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
Also Read : టాలీవుడ్ హీరోలకు అందని ద్రాక్ష లాగా మారిపోయిన లోకేష్ కనకరాజ్!
పెరిగిన టికెట్స్ ధరలు, సౌకర్యం, కంటెంట్ ప్రేక్షకులను డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ కి దగ్గర చేస్తున్నాయి. గతంలో చాలా కుటుంబాలలో నెలకు రెండు మూడు పర్యాయాలు సభ్యులందరూ కలిసి సినిమాకు వెళ్లే కల్చర్ ఉంది. అది క్రమేణా తగ్గుతూ వస్తుంది. అసలు సినిమా చూసేందుకు థియేటర్ కి వెళ్లడం మానేసిన కుటుంబాలు, వ్యక్తులు సైతం ఉన్నారు. వీరందరూ ఓటీటీ సంస్ధల్లో సినిమాలు చూస్తున్నారు. ఓటీటీ కంటెంట్ కి పరిమితం లేదు. సినిమాలు, సిరీస్లు, సీరియల్స్, స్పోర్ట్స్, డాక్యుమెంటరీస్.. ఒకటేమిటీ, ఓటీటీలో లేని కంటెంట్ అనేది లేదు.
నచ్చిన సినిమాను వీలు కుదిరినప్పుడు చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ తో సినిమాకు వెళితే అయ్యే ఖర్చుతో ఏడాది పాటు సబ్స్రిప్షన్ ఇచ్చే సంస్థలు ఉన్నాయి. ఇన్ని అనుకూలతల మధ్య ఓటీటీ సంస్థలకు ఆదరణ అంతకంతకు పెరుగుతూ పోతుంది. 2024కి గాను డిజిటల్ రెవెన్యూ డేటా పరిశీలీస్తే ఈ విషయం అవగతం అవుతుంది. గత ఏడాది ఇండియాలో డిజిటల్ రెవెన్యూ రూ. 37940 కోట్లు. ఇందులో మేజర్ వాటా యూట్యూబ్ దక్కించుకుంది. ఇతర డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అందుకోలేని దూరంలో యూట్యూబ్ ఉంది. 37.70% మార్కెట్ షేర్ తో యూట్యూబ్ గత ఏడాది రూ. 14300 ఆర్జించింది.
రెండో స్థానంలో జియో సినిమా ఉంది. ఇండియాకు చెందిన ఈ సంస్థ 31 .20% మార్కెట్ షేర్ తో 11835 కోట్ల రెవెన్యూ అందుకుంది. ఇక 7.60% మార్కెట్ షేర్ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ రూ. 2900 కోట్ల రెవెన్యూ రాబట్టింది. ఇక డిస్ని ప్లస్ హాట్ స్టార్ 7.20% మార్కెట్ షేర్ తో రూ. 2750 కోట్లు, అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ 3.20% షేర్ తో రూ. 1200 కోట్ల రెవెన్యూ ఆర్జించి టాప్ 5లో ఉన్నాయి.
అనంతరం ఆహా, సోనీ లివ్, జీ 5, హోచాయ్, ఇతర మీడియా సంస్థలు వరుసగా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.
#comment డిజిటల్ మీడియాదే భవిష్యత్ pic.twitter.com/9mo72FDsp7
— devipriya (@sairaaj44) May 2, 2025