Srileela : సినిమాలలో తన అందంతో, టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది రియల్ లైఫ్ లో కూడా తన మంచి మనసుతో అందరిని ఆకట్టుకుంటుంది. తన అద్భుతమైన నటనతో, డాన్స్ తో తెలుగు మరియు కన్నడ ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ హీరోయిన్ కేవలం 23 ఏళ్ల అతి చిన్న వయసులోనే ముగ్గురు పిల్లలకు తల్లిగా మారింది. కానీ సొంత పిల్లలకు కాదు ముగ్గురు పిల్లలను దత్తత తీసుకొని అమ్మ ప్రేమను పంచబోతుంది ఈ యంగ్ హీరోయిన్. ఈమె మరెవరో కాదు ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ శ్రీ లీల. శ్రీ లీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అని చెప్పొచ్చు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన పెళ్లి సందడి సినిమాతో శ్రీ లీల హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకుంది ఈ యంగ్ బ్యూటీ. శ్రీ లీల జూన్ 14, 2001లో అమెరికాలో జన్మించింది. కానీ ఈమె పెరిగింది మాత్రం బెంగళూరులోనే అని చెప్పొచ్చు. శ్రీ లీల తల్లి డాక్టర్ స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్ గా పని చేస్తున్నారు.
Also Read : నలభై వేల కోట్లకు చేరువలో 2024 డిజిటల్ రెవెన్యూ, అగ్రస్థానం ఎవరిదో తెలుసా?
అయితే డాక్టర్ స్వర్ణలత తన భర్త ప్రముఖ పారిశ్రామికవేత్త సూరపనేని సుధాకరరావు తో విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత శ్రీ లీల పుట్టిందని తెలుస్తుంది. సుధాకర్ రావు 2021లో ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించే శ్రీ లీల తన కూతురు కాదని, ఆమెతో తన పేరును ముడి పెట్టవద్దని అప్పట్లో మీడియాను కోరగా అది సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీ లీల సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే శ్రీ లీల ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీ లీల 2021లో తన ఎంబిబిఎస్ చదువు పూర్తి చేసింది. డాన్స్ పై చాలా ఇష్టం ఉండడంతో శ్రీ లీలా చిన్నతనంలోనే భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది.
2019లో కిస్ అనే కన్నడ సినిమాతో శ్రీ లీల హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కన్నడలోనే భరాటే, బై టు లవ్ వంటి కన్నడ సినిమాలలో నటించి కన్నడ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీ లీల ఆ తర్వాత ధమాకా, స్కందా,భగవంత్ కేసరి, ఆది కేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం వంటి హిట్ సినిమాలలో నటించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈమెకు సేవా గుణం కూడా చాలా ఎక్కువే అని చెప్పొచ్చు. శ్రీ లీల తనకు 21 ఏళ్ల వయసు ఉన్న సమయంలో ఒక అనాధశ్రమాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. రీసెంట్ గా కూడా ఈ యంగ్ బ్యూటీ మరో పాపను దత్తత తీసుకొని తన ఇంటికి కొత్త సభ్యురాలుగా పరిచయం చేస్తూ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.