బాలయ్య మాటలకు హార్ట్ అయిన చిరంజీవి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఒక మంచి పని చేసేందుకు ముందుకొస్తే వెనక్కి లాగేందుకు పదిమంది సిద్ధంగా ఉంటారనేది తెల్సిందే. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు వీరు ముందుకు రారు.. వచ్చిన వాళ్లపై మాత్రం రాళ్లు వేసేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే ఇష్యూ నడుస్తోంది. కేసీఆర్ తో జరిగిన మీటింగ్ కు తనను పిలువలేదని అసహనంతో బాలయ్య నోరుజారారు. భూములు పంచుకునేందుకు తలసానితో మీటింగ్ పెట్టకున్నారా? అనడంతో టాలీవుడ్లో అగ్గి రాజుకుంది. దీనిపై మెగాబ్రదర్ నాగబాబు తన […]

Written By: Neelambaram, Updated On : June 5, 2020 5:41 pm
Follow us on


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఒక మంచి పని చేసేందుకు ముందుకొస్తే వెనక్కి లాగేందుకు పదిమంది సిద్ధంగా ఉంటారనేది తెల్సిందే. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు వీరు ముందుకు రారు.. వచ్చిన వాళ్లపై మాత్రం రాళ్లు వేసేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే ఇష్యూ నడుస్తోంది. కేసీఆర్ తో జరిగిన మీటింగ్ కు తనను పిలువలేదని అసహనంతో బాలయ్య నోరుజారారు. భూములు పంచుకునేందుకు తలసానితో మీటింగ్ పెట్టకున్నారా? అనడంతో టాలీవుడ్లో అగ్గి రాజుకుంది. దీనిపై మెగాబ్రదర్ నాగబాబు తన యూట్యూట్లో బాలయ్యపై ఫైరయ్యారు. టీడీపీ హయాంలోనే భూములు పంచుకున్నారని.. నోరు అదుపు పెట్టుకో.. నువ్వు కింగ్ కాదు.. జస్ట్ హీరో అనడంతో బాలయ్య ఫాన్స్ నాగబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడిన సంగతి తెల్సిందే. అయితే నాగబాబును సపోర్టు చేస్తూ ఓ వర్గం.. బాలయ్యను మద్దతుగా ఓ వర్గం సోషల్ మీడియాలో ఒకరి పై ఒకరు కాలు దువ్వుకుంటున్నారు.

అయితే ఈ ఇష్యూపై మెగాస్టార్ చిరంజీవి మౌనంగా ఉన్నారు. అయితే కొందరు సినీ ప్రముఖులు టీవీ డిబెట్స్ లో పాల్గొని ఈ వివాదంలో పెట్రోల్ పోసి మరింత రాజేస్తున్నారు. ఈ వివాదాన్ని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుని వ్యక్తిగతంగా పాపులర్ అయ్యేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఒకవైపు చిరంజీవి వర్సెస్ బాలయ్య ఇష్యూ కొనసాగుతుండగానే బాలకృష్ణ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో చిరంజీవి, నాగబాబుపై చేసిన కామెంట్స్ మరింత వివాదానికి దారితీశాయి. అమెరికాలో చిరంజీవి ఆధ్వర్యంలో ప్రొగ్రాం జరిగినప్పుడు ఐదు కోట్లు వచ్చాయని.. చివరికి కోటితో మా బిల్డింగ్ కట్టారని.. మిగతా నాలుగు కోట్లు ఏమైయ్యాయి? అంటూ ప్రశ్నించారు. తనపై నాగబాబే మాట్లాడుతున్నారని.. ఇండస్ట్రీ అంతా తనకే సపోర్టు వస్తుందని.. ఇంకా నేనేందుకు మాట్లాడాలంటూ కామెంట్స్ చేశారు. తనకు మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలంటూ ఘాటుగా స్పందించారు.

భూములు పంచుకుంటున్నారని ఆరోపణపై ఇప్పటికే ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి డబ్బులు స్వాహా చేశారనే అర్థం వచ్చేలా ఇంటర్వ్యూలో మాట్లాడటం చూస్తుంటే కావాలనే మెగాస్టార్ ను టార్గెట్ చేస్తున్నట్లు కన్పిస్తుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై చిరంజీవి నోచ్చుకున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ విన్పిస్తుంది. దీంతో ఇకపై తాను ఇండస్ట్రీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని టాక్ విన్పిస్తోంది. షూటింగులు ప్రారంభించే విషయంలోనూ పక్కనే ఉండాలనుకుంటున్నారా? ప్రభుత్వం సినిమా షూటింగులకు పర్మిషన్ ఇచ్చాక సినిమాలకే పూర్తి సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే మరికొందరు మాత్రం చిరంజీవి ఇప్పటికే బాలయ్యతో ఫోన్లో మాట్లాడి వివాదానికి పుల్ స్టాప్ పెట్టారని అంటున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్లో ఇప్పటివరకు అన్ని సమస్యలపై ముందుండి పరిష్కారానికి కృషి చేస్తున్న చిరంజీవి తనపై వస్తున్న నిందలకు హార్ట్ అయి ఒకసారి కాడి వదిలేస్తే? దిక్కు ఎవరనేది ఆసక్తిగా మారింది. చిరంజీవి కాడి వదిలేస్తే బాలయ్య మోస్తారా?.. మోయగలరా? అనేది మిలియన్ల డాలర్ల ప్రశ్న మారింది.