https://oktelugu.com/

పోస్టుమార్టంలో ఏనుగు విషాద గాధ!

కేరళలో చంపేసిన ఏనుగు విషాద గాధ పోస్టుమార్టంలో బయటపడింది. ఆ ఏనుగు కళేబరానికి పశువైద్యులు జరిపిన పోస్టుమార్టం నివేదిక తాజాగా వెల్లడైంది. ఈ పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ లో దయనీయ విషయాలు వెలుగులోకొచ్చాయి. మరణించిన ఆ ఏనుగు రెండు వారాల ముందు నుంచి ఏమీ తినలేదని, తాగలేదని పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ లో తేలింది. పేలుడు పదార్థాల వల్ల ఏనుగు నోటి భాగం తీవ్రంగా గాయపడిందని, ఆహారం తీసుకోలేక పోయిందని తెలిసింది. ఏనుగు నీళ్లలో మునగడం వల్ల, […]

Written By: , Updated On : June 5, 2020 / 02:00 PM IST
Follow us on

Kerala incident

కేరళలో చంపేసిన ఏనుగు విషాద గాధ పోస్టుమార్టంలో బయటపడింది. ఆ ఏనుగు కళేబరానికి పశువైద్యులు జరిపిన పోస్టుమార్టం నివేదిక తాజాగా వెల్లడైంది. ఈ పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ లో దయనీయ విషయాలు వెలుగులోకొచ్చాయి. మరణించిన ఆ ఏనుగు రెండు వారాల ముందు నుంచి ఏమీ తినలేదని, తాగలేదని పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ లో తేలింది. పేలుడు పదార్థాల వల్ల ఏనుగు నోటి భాగం తీవ్రంగా గాయపడిందని, ఆహారం తీసుకోలేక పోయిందని తెలిసింది.

ఏనుగు నీళ్లలో మునగడం వల్ల, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ లో వెల్లడైంది. గాయపడిన తర్వాత ఏనుగు ఎక్కువ సేపు బతకపోవడానికి ఇదే ప్రధాన కారణమని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ ఘటనను సీరియస్‌ గా తీసుకున్న కేరళ ప్రభుత్వం నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఘటనలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది.