Lokesh Universe and Sandeep Vanga Universe
Lokesh Kanagaraj-Sandeep Vanga: తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం లోకేష్ యూనివర్స్ తో వరుస సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ఇక అందులో భాగంగానే మొదట కార్తీతో చేసిన ఖైదీ సినిమాతో తన యూనివర్స్ ను స్టార్ట్ చేశాడు. ఇక అప్పటినుంచి లోకేష్ యూనివర్స్ పేరుతో ఒక సినిమాకి మరొక సినిమాకి ఇంటర్ లింక్ అనేది ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ఆయన కమలహాసన్ తో చేసిన విక్రమ్ సినిమాలో తన ముందు సినిమాలకు సంబంధించిన కొన్ని క్యారెక్టర్లని ఈ సినిమాలో ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రాబోయే సినిమాలకి కూడా ఒక లింక్ అనేది ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే లోకేష్ యూనివర్స్ లో ఉండే సినిమాలను ఆయన ఒక వే లో నడిపిస్తూ ఉంటాడు. ఇక ఈ క్యారెక్టర్లన్నింటినీ కలుపుతూ చివర్లో దీనికి ఎండింగ్ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన లోకేష్ యూనివర్స్ పేరుతో వరుస సినిమాలను చేస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ..ప్రస్తుతం ఈయన పాన్ ఇండియాలో తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కూడా సందీప్ యూనివర్స్ పేరుతో సినిమాలను చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలను కలుపుతూ స్పిరిట్ సినిమాలో కూడా వీళ్ళకి సంబంధించిన కీలకమైన విషయాలను డీల్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక లోకేష్ యూనివర్స్ లో డిఫరెంట్ పాత్రలు ఉంటాయి.
కానీ సందీప్ యూనివర్స్ లో మాత్రం మెయిన్ క్యారెక్టర్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దాని వల్ల లోకేష్ యూనివర్స్ సినిమాలకు, సందీప్ యూనివర్స్ సినిమాలకు మధ్య చాలా తేడా ఉందనే చెప్పాలి. ఇక లోకేష్ యూనివర్స్ గురించి చెప్పాలంటే ఆ సినిమాలను చూసే ప్రేక్షకులకు కొంచెం క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది. కానీ సందీప్ యూనివర్స్ లో వచ్చే సినిమాలు మాత్రం తక్కువ క్యారెక్టర్స్ తో చాలా క్లారిటీగా తెరకెక్కబోతున్నాయనే చెప్పాలి…