Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. బాహుబలి సిరీస్, ఆర్ ఆర్ ఆర్ సినిమాలతో జక్కన్న రేంజ్ గ్లోబల్ ఫేమ్ రాబట్టాడు. ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా సత్తా చాటుతున్నారు. కాగా దర్శకుడు రాజమౌళి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. కాగా రాజమౌళి దర్శకుడు కాకముందే తన సినిమాల్లో ఒకటి ఉండకూడదని ఫిక్స్ అయ్యాడట.
సీనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఓ దారుణమైన క్లైమాక్స్ చూసి ఆ నిర్ణయానికి వచ్చారట. ఒకవేళ తాను ఫ్యూచర్ లో సినిమాలు తీస్తే అటువంటి ఎండింగ్ కచ్చితంగా పెట్టకూదని రాజమౌళి నిర్ణయం తీసుకున్నారట. వివరాల్లోకి వెళితే .. రాజమౌళికి చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలు అంటే బాగా ఇష్టమట. ఆయన ఫ్యామిలీలో 13 మంది కజిన్స్ ఉండేవారట.
అందులో పెద్దవాళ్లు నెలకు రెండు సినిమాలు, చిన్నవాళ్లు మాత్రం నెలకు ఒక్క సినిమానే చూడాలని ఇంట్లో రూల్ పెట్టారట. అప్పట్లో తమ ఊళ్ళో రెండే థియేటర్స్ ఉండేవట. అందులో ఒక థియేటర్లో ఎన్టీఆర్ అగ్గి పిడుగు, మరో థియేటర్లో మంచి చెడు అనే సినిమాలు రిలీజ్ అయ్యాయట. అగ్గి పిడుగును చూసిన పెద్ద వాళ్ళు సినిమాలో కత్తి ఫైట్లు, యాక్షన్ సీన్స్ ఉన్నాయని చెప్పారట.
దీంతో ఎలాగైనా ఆ సినిమా చూడాలని జక్కన అనుకున్నారట. అగ్గి పిడుగు సినిమాకి వెళ్దామని రెడీ అయితే .. మంచి చెడు సినిమాలో కూడా మంచి ఫైట్లు ఉన్నాయని అబద్దం చెప్పి కన్విన్స్ చేశారట. తీరా సినిమాలో ఎటువంటి యాక్షన్ సీన్స్ లేకపోవడంతో రాజమౌళి చాలా నిరాశ చెందాడట. చివరికి హీరో చనిపోవడం. ఆ ట్రాజెడీ ఎండింగ్ చూసి రాజమౌళికి పిచ్చ కోపం వచ్చిందట. అప్పటికే చిరాకుతో ఉన్న రాజమౌళి ఎన్టీఆర్ చనిపోవడం చూసి ఒక వేళ భవిష్యత్తులో సినిమాలు తీస్తే జన్మలో అలాంటి ఎండింగ్ పెట్టకూడదని ఫిక్స్ అయ్యానని .. చెప్పుకొచ్చారు.