https://oktelugu.com/

Vishal: ఆ తమిళ హీరో వైసిపి మద్దతుదారుడా?

వాస్తవానికి విశాల్ తెలుగువాడు. ఆయన కుటుంబం చెన్నైలో స్థిరపడింది. తమిళ సినిమా రంగంలో రాణించి వెలుగులోకి వచ్చాడు. అక్కడ విజయవంతం అయిన తర్వాత తెలుగులో డబ్బింగ్ అయిన పందెంకోడి సినిమాతో తెలుగులో అరంగేట్రం చేశాడు.

Written By:
  • Dharma
  • , Updated On : April 18, 2024 11:02 am
    Vishal

    Vishal

    Follow us on

    Vishal: వైసీపీ తమిళ హీరో సేవలను తరచూ వాడుకుంటుంది. మంచి మైలేజ్ వచ్చేలా ఆయనతో మాట్లాడిస్తోంది. రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు మాట్లాడే సదరు హీరో.. వైసీపీకి ఫేవర్ చేస్తుంటారు. ఆయనే తమిళ్ హీరో విశాల్ అలియాస్ విశాల్ కృష్ణారెడ్డి. నటుడితో పాటు నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జగన్ పట్ల ఆయన ఆది నుంచి అభిమానం చూపిస్తుంటారు. ఆ అభిమానాన్ని కాస్త వైసిపి అడ్వాంటేజ్ గా ఉపయోగించుకుంటుంది.

    వాస్తవానికి విశాల్ తెలుగువాడు. ఆయన కుటుంబం చెన్నైలో స్థిరపడింది. తమిళ సినిమా రంగంలో రాణించి వెలుగులోకి వచ్చాడు. అక్కడ విజయవంతం అయిన తర్వాత తెలుగులో డబ్బింగ్ అయిన పందెంకోడి సినిమాతో తెలుగులో అరంగేట్రం చేశాడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2005లో లింగు స్వామి దర్శకత్వంలో ఆ సినిమా వచ్చింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో పాటు ఈ సినిమాలో కీలక పాత్రకు వైయస్ రాజారెడ్డి పేరు పెట్టారు. ఆయన కుమారుడుగా విశాల్ నటించాడు. అప్పటినుంచి విశాల్ ను తమ వాడిగా ఓ సామాజిక వర్గం భావిస్తోంది. అటు విశాల్ సైతం ఆ సామాజిక వర్గం పట్ల చాలా విధేయత ప్రదర్శిస్తాడు. అందులో భాగంగానే జగన్ అంటే చాలా అభిమానిస్తాడు.

    ఒకానొక దశలో చంద్రబాబుపై విశాల్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చాలా రోజులు ఈ టాక్ నడిచింది. వైసీపీకి దగ్గరగా ఉండడం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, తమిళ నటుడు కావడం, కుప్పం నియోజకవర్గంలో తమిళులు ఎక్కువగా ఉండడం తదితర కారణాలతో విశాల్ పోటీ చేస్తారని పెద్ద ఎత్తున వైసిపి ప్రచారం చేసింది. కానీ అటువంటిదేమీ లేదని విశాల్ ఖండించారు. వైసిపి తో పాటు జగన్ పై అభిమానం చాటుతూనే.. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తేల్చేశారు. అయితే ఇప్పుడు మరోసారి ఎన్నికల ముంగిట విశాల్ పేరు బయటకు వచ్చింది.

    సీఎం జగన్ పై గులకరాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాల్ స్పందించారు. ఘటన దురదృష్టకరంగా అభివర్ణించారు. తిరిగి మరోసారి జగన్ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను వైసిపి మద్దతు దారుడిని కాదని.. జగన్ అభిమానినని విశాల్ స్పష్టం చేశారు. గత ఎన్నికలకు ముందు జగన్ సీఎం అవుతారని చెప్పానని.. ఈసారి కూడా అదే చెబుతున్నానని విషయాలు చెప్పడం విశేషం. అయితే విశాల్ జోష్యం పనిచేస్తుందా? లేదా అన్నది చూడాలి.