https://oktelugu.com/

ట్రెండ్ సెట్.. వాట్సాప్ గ్రూప్ లో లడ్డూ వేలం..!

కరోనా మహమ్మరి కారణంగా ఈసారి గణేష్ నవరాత్రి ఉత్సవాలు కళ తప్పిపోయాయి. పల్లెలు, నగరాలు, బస్తీల్లో పెద్దగా వినాయకుడి విగ్రహాలు సందడి కన్పించడం లేదు. అడుగడుగునా కన్పించే వినాయక మండపాలు కరోనా కారణంగా ఈసారి పెద్దగా కన్పించడం లేదు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో పోలీసులు వినాయక విగ్రహాలపై ఆంక్షలు విధించారు. నవరాత్రుల్లో కరోనా నిబంధనలు పాటించడం అంత సులువు కాకపోవడంతో ప్రజలు పెద్దగా ఆసక్తిని చూపడం లేదని తెలుస్తోంది. Also Read: ఒకరి తర్వాత ఒకరు భలే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 25, 2020 / 02:59 PM IST
    Follow us on


    కరోనా మహమ్మరి కారణంగా ఈసారి గణేష్ నవరాత్రి ఉత్సవాలు కళ తప్పిపోయాయి. పల్లెలు, నగరాలు, బస్తీల్లో పెద్దగా వినాయకుడి విగ్రహాలు సందడి కన్పించడం లేదు. అడుగడుగునా కన్పించే వినాయక మండపాలు కరోనా కారణంగా ఈసారి పెద్దగా కన్పించడం లేదు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో పోలీసులు వినాయక విగ్రహాలపై ఆంక్షలు విధించారు. నవరాత్రుల్లో కరోనా నిబంధనలు పాటించడం అంత సులువు కాకపోవడంతో ప్రజలు పెద్దగా ఆసక్తిని చూపడం లేదని తెలుస్తోంది.

    Also Read: ఒకరి తర్వాత ఒకరు భలే తగులుకున్నారు… ఆర్కే కి ఊపిరి ఆడుతోందా?

    ప్రతీయేటా ఎంతో వైభవంగా జరిగే గణేష్ ఉత్సవాలు ఈసారి సాదాసీదాగా జరుగుతున్నాయి. మాస్కులు ధరిస్తే వినాయక మండపాల్లోకి భక్తులకు ఎంట్రీ లభిస్తుంది. భౌతిక దూరం పాటించేలా.. శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లను ఉత్సవ కమిటీ నిర్వాహాకులు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. కరోనా నిబంధనలు పాటించేలా నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారు. అయితే వినాయక ఉత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే లడ్డూవేలం ఎలా నిర్వహిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

    లడ్డూవేలంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వేలంపాడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా నిబంధనలు ఉండటంతో లడ్డూ వేలం పాటలకు ఆటంకం కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉత్సవ కమిటీ నిర్వహాకులు లడ్డూవేలం కోసం వాట్సాప్ గ్రూపులను నిర్వహిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని మొండేటి వీధి లక్ష్మీ గణపతి ఆలయంలో లడ్డూను వాట్సాప్ గ్రూప్ ద్వారా వేలం నిర్వహించి కొత్త ట్రెండ్ సెట్ చేశారు.

    Also Read: నిరుద్యోగ యువతకు జగన్ గుడ్ న్యూస్

    ఏకంగా నలుగురు వ్యక్తులు కలిసి రూ.1.03 లక్షలకు వినాయకుడి లడ్డూను దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి ఆలయ అధికారులు మాట్లాడుతూ వాట్సాప్ ద్వారా వేలం నిర్వహించడం కొత్తగా ఉందని.. కోవిడ్ మహామ్మరి దృష్ట్యా ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. వాట్సాప్ లో లడ్డూ వేలంపాటలకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నిర్వాహాకులు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వినాయకుడి లడ్డూ వేలం పాటలు కొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయంగా కన్పిస్తున్నాయి.