Chiranjeevi Family Doctor: తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి చిరంజీవి గుర్తుకొస్తాడు. ఎందుకంటే అప్పటివరకు మూస ధోరణిలో సాగుతున్న సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన ఘనత చిరంజీవికి దక్కుతోంది. ఆయన డ్యాన్స్ లతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులందరిలో ఒక కొత్త జోష్ నింపిన చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీని మరో మెట్టు పైకెక్కించాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. చిరంజీవి లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేది వాస్తవం…అలాంటి చిరంజీవి కెరియర్ మొదట్లో హీరోగా చేస్తున్నప్పుడు తన ఫ్యామిలీ డాక్టర్ గా ఒక స్టార్ హీరో ఉండేవాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి రాజశేఖర్ కెరియర్ మొదట్లో చిరంజీవి ఫ్యామిలీకి డాక్టర్ గా ఉండి వాళ్ల ఫ్యామిలీ మొత్తానికి ఇలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్న తనే చూసుకునేవాడు. ఇక అలాంటి క్రమంలోనే చిరంజీవి తను చేయాల్సిన కొన్ని సినిమాలను రాజశేఖర్ కి అప్పజెప్పి అతని చేత సినిమాలు చేయమని కొంతమంది డైరెక్టర్, ప్రొడ్యూసర్లను కూడా ఎంకరేజ్ చేశాడు…
ఇక ఈ క్రమంలోనే రాజశేఖర్ సైతం మంచి సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. మొత్తానికైతే రాజశేఖర్ ఇంట్లో కొన్ని ఫ్యామిలీ ఇబ్బందులు ఉండటం వాటిని చిరంజీవి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఆ ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ చెప్పడం లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండేవి.
ఇక ఒకరోజు చిరంజీవి సినిమా బిజీలో ఉండటం వల్ల రాజశేఖర్ ని పట్టించుకోకపోవడంతో అప్పటినుంచే చిరంజీవి – రాజశేఖర్ మధ్య కొన్ని విభేదాలైతే ఏర్పడ్డాయని కొంతమంది చెబుతూ ఉంటారు. మొత్తానికైతే అటు చిరంజీవి, ఇటు రాజశేఖర్ ఇద్దరు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ప్రస్తుతం రాజశేఖర్ కి సినిమాలేమీ లేకపోవడంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ముందుకు వస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఒక రెండు, మూడు సినిమాలు కూడా కమిట్ అయ్యాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి లాంటి నటుడైతే ఇప్పుడు కూడా తన మార్కెట్ ను అంతకంతకు పెంచుకుంటూ ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు…