Telangana vs Andhra Film Industry: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ సాధిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడే స్టూడియోలో నిర్మించుకొని హీరోలందరు ఇక్కడే సెటిలైపోయారు. మద్రాస్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ కి తీసుకువచ్చింది. నాగేశ్వరరావు గారిని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలోనే ఇప్పుడు 2014వ సంవత్సరంలో తెలంగాణ సపరేట్ స్టేట్ గా మారింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లోనే ఉంటుంది. స్టేట్ డివైడ్ అయిపోయి 11 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ నే ఉమ్మడి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గా వాడుకుంటున్నారు…ఇక ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఫిలిం ఇండస్ట్రీ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా సపరేట్ సినిమా ఇండస్ట్రిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ఇటు సినిమా వాళ్లు అటు రాజకీయ నాయకులు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వైజాగ్ వేదికగా సినిమా ఇండస్ట్రీ ఏర్పడితే బాగుంటుందని ఇప్పటికే చాలామంది స్టూడియోలను కూడా నిర్మిస్తున్నారు.
మరి ఇలాంటి క్రమంలోనే సపరేట్ గా ఆంధ్ర ఇండస్ట్రీ రావడం వల్ల ఇటు తెలంగాణ, ఆంధ్ర రెండు స్టేట్లు సపరేట్ అయి ఇండస్ట్రీని ఫార్మ్ చేసిన వాళ్లవుతారు. ఇక దానికి తోడుగా ఇప్పటివరకు వినోదపు పన్ను ని తెలంగాణ గవర్నమెంట్ కు మాత్రమే చెల్లిస్తున్నారు.
Also Read: ఆ స్టార్ హీరో చిరంజీవి ఫ్యామిలీ డాక్టర్ అనే విషయం మీకు తెలుసా..?
దాని ద్వారా ఆంధ్ర గవర్నమెంటుకి సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా వచ్చే ఆదాయం అయితే లేదు. కాబట్టి తమ సినిమాల మీద వచ్చే పన్ను తమకే కావాలని ఉద్దేశ్యంతో ఇలాంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ విషయం మీద అప్పుడప్పుడు కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. కొంతమంది ఆంధ్రాలో ఇండస్ట్రీ ఏర్పాటు చేయడం అవసరమా?
ఆల్రెడీ తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీని వాడుకుంటే సరిపోతోంది కదా అంటూ కామెంట్లు చేస్తుంటే మరి కొంత మంది మాత్రం సపరేట్ గా ఆంధ్రాకి కూడా ఇండస్ట్రీ ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే దీనికి సంబంధించిన విషయాలు ఎక్కడ ప్రస్తావించకపోయిన కూడా ఆంధ్ర నాయకులను బట్టి చూస్తే అక్కడ ఇండస్ట్రీని ఫామ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది…