Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గత 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక నటుడు చిరంజీవి… ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి కెరియర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికి ఇండస్ట్రీలో నిలదుక్కుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ సినిమా ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకునేలా చేశాయి. మొత్తానికైతే సగటు ప్రేక్షకులందరు ఇష్టపడే సినిమాలను చేయడంలో చిరంజీవి ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పటికి ప్రేక్షకులు మెచ్చే సినిమాలను తీయడానికే ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
మరి ఇలాంటి క్రమంలోనే ఇకమీదట ఆయన నుంచి రాబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామంది ఆర్టిస్టులను ఎంకరేజ్ చేశాడు. ముఖ్యంగా ఉత్తేజ్, శివాజీ, శివాజీ రాజా, రవితేజ లాంటి నటులను చిరంజీవి ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వచ్చాడు. కొన్ని సినిమాల్లో అవకాశాలను కూడా ఇప్పించాడు. ఇక అతని వల్లే ఇప్పుడున్న నటులందరు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారనే చెప్పాలి.
ఇక రవితేజ ఒక్కడు మాత్రం స్టార్ హీరోగా ఇండస్ట్రీలో వెలుగొందుతున్నప్పటికి మిగతా వాళ్ళందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమ కెరీర్ ని ముందుకు సాగిస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పటికి ఉత్తేజ్ లాంటి నటుడికి చిరంజీవి సినిమాలో ఒక పాత్ర అయితే ఇస్తుంటాడు. అతని కోసం సెపరేట్ గా ఒక క్యారెక్టర్ ను డిజ్జిన్ చేస్తుంటారు. ఇలా చిరంజీవి తనను నమ్ముకున్న వాళ్లెవరిని మోసం చేయడు.
అందుకే తనతో పాటు వాళ్లను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి క్రేజ్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక చిరంజీవి ప్రస్తుతం సీనియర్ హీరోగా తన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నప్పటికి అతని ప్లేస్ ని రీప్లేస్ చేసే ఈతరం హీరోలు మాత్రం ఇంకా దొరకడం లేదు. ఎవరికి వాళ్లు సినిమాలు చేస్తున్నప్పటికి అన్ని క్వాలిటీస్ ఒక్కరిలో ఉన్న ఆ హీరో ఎవరా అనేదాని కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…