Manchu Manoj : సినిమా ఇండస్ట్రీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అలాగే ఇక్కడ స్టార్లుగా వెలుగొందలనే కోరిక కూడా ఉంటుంది… కానీ ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టమనే చెప్పాలి. విపరీతంగా శ్రమిస్తే తప్ప ఇక్కడ సూపర్ సక్సెస్ ని అందుకోలేరు…ఇక చాలామంది హీరోలు వరుస స్క్సెలను అందుకొని వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవడం మోహన్ బాబు చాలావరకు కృషి చేశారనే చెప్పాలి. విలన్ గా నటిస్తూనే హీరోగా పలు సినిమాల్లో నటించి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. స్టార్ డైరెక్టర్ల తో వర్క్ చేసి సక్సెస్ లను అందుకున్న హీరోగా మోహన్ బాబు కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. మరి అలా మంచి సినిమాలను చేసి ఇండస్ట్రీలో చెరగని ముద్రను వేసిన ఆయన గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమయ్యారు. ఆయనకి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఇంట్లోనే ఖాళీగా ఉంటు రెస్టు తీసుకుంటున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో తన కొడుకులతో జరిగిన వివాదం వల్ల ఆయన మరోసారి వార్తల్లో నిలవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. తన కొడుకు అయిన మనోజ్ ని కొట్టించాడంతో మనోజ్ హాస్పిటల్ లో చేరడమే కాకుండా మోహన్ బాబు మీద కేసు కూడా ఫైల్ చేశాడు. ఇక అప్పటి నుంచి వీళ్ల మధ్య భారీ గొడవలైతే జరుగుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా మంచు విష్ణు వల్లే మోహన్ బాబు మనోజ్ ని దరికి చేరనివ్వడం లేదంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మనోజ్ కి విష్ణు కి మధ్య చాలా రోజుల నుంచి కొన్ని గొడవలైతే ఉన్నాయి. ఇక లాస్ట్ ఇయర్ కూడా విష్ణు మనోజ్ ని కొట్టడానికి తన ఇంటి మీదకి వచ్చిన వీడియోని మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే సినిమాలా పరంగా చూసుకున్న కూడా మనోజ్ యాక్టింగ్ పరంగా మంచి గుర్తింపును సంపాదించుకొని సక్సెస్ లను కూడా సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో విష్ణు ఎలాగైనా సరే మనోజ్ కి పెద్దగా సక్సెస్ లు ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే మనోజ్ కి రావాల్సిన కొన్ని సినిమాలను పక్కకు తప్పించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి అన్నదమ్ముల మధ్య ఇలాంటి విభేదాలు ఉంటాయా అని మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ అనేది సాధించలేకపోయారు.
ఇక విష్ణుతో పోలిస్తే మనోజ్ కొంతవరకు నటన పరంగా బెస్ట్ అంటూ కొన్ని ప్రశంసలను కూడా తెచ్చుకున్నాడు. అయినప్పటికి ఆయనకి పెద్దగా సక్సెస్ అయితే దక్కలేదు. మరి ఇప్పుడు ఈ అన్నదమ్ముల మధ్య భారీ యుద్ధమే జరుగుతుంది. మరి వీళ్ళ గొడవ ఎక్కడిదాకా వెళుతుందనేది తెలియాల్సి ఉంది…