https://oktelugu.com/

Rajinikanth : పుట్టినరోజు నాడు అభిమానులను నిరాశపర్చిన రజినీకాంత్..ఇక ఆ క్రేజీ ప్రాజెక్ట్ లేనట్టేనా?

నేడు సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 12, 2024 / 01:58 PM IST

    Rajinikanth

    Follow us on

    Rajinikanth : నేడు సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ ఏడాదితో ఆయన 74వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. 7 పదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికీ సూపర్ స్టార్ స్టేటస్ లోనే కొనసాగుతూ, నేటి తరం పాన్ ఇండియన్ స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వని రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తప్ప, ఆయన వయస్సులో ఉన్న సూపర్ స్టార్స్ లో ఇలాంటి రేంజ్ ని ప్రస్తుతం ఎవ్వరూ ఎంజాయ్ చేయడం లేదు. భవిష్యత్తులో ఇప్పుడు ఉన్న పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ కూడా ఈ రేంజ్ కి రాలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈరోజు రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేస్తున్న కొత్త సినిమాల గురించి అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఆశించడం సహజమే.

    ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తో ఆయన చేస్తున్న ‘కూలీ’ అనే చిత్రానికి సంబంధించిన టీజర్ ని నేడు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్టు కాసేపటి క్రితమే ఆ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసాడు. అదే విధంగా రజినీకాంత్ గత ఏడాది ‘జైలర్’ చిత్రం తో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడో అందరికీ తెలిసిందే. 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి సీక్వెల్ ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఆ చిత్రం రన్నింగ్ లో ఉన్నప్పుడే ప్రకటించాడు. ఇటీవలే ఆ సినిమాకి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా చేసారు. ఈ ప్రోమో ని రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారని అభిమానులు ఆశించారు. దీని కోసం ఎంతగానో ఎదురు చూసారు కూడా. కానీ నేడు ‘జైలర్ 2’ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాదనీ తెలియడంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.

    కనీసం ‘జైలర్ 2’ త్వరలో ప్రారంభం కాబోతుంది అనే అప్డేట్ అయినా ఇస్తారేమో అని ఎదురు చూసిన అభిమానులకు తీవ్రమైన నిరుత్సాహమే ఎదురైంది. అసలు ఈ చిత్రం ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే కేవలం ‘కూలీ’ మూవీ టీజర్ కోసమే నేడు ‘జైలర్ 2’ అప్డేట్ ని ఆపారని, లేకపోతే కచ్చితంగా ‘జైలర్ 2’ అప్డేట్ ఉండేదని, క్రిస్మస్, లేదా న్యూ ఇయర్ కి ‘జైలర్ 2’ అప్డేట్ వస్తుందని కొంతమంది సీనియర్ రజినీకాంత్ అభిమానులు చెప్తున్నారు. కానీ దేనికి కూడా అధికారికంగా ఖరారు కాలేదు. ప్రస్తుతానికి అయితే ‘కూలీ’ చిత్రం మీదనే రజినీకాంత్ పూర్తి స్థాయి ఫోకస్ ఉంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరి, లేదా ఫిబ్రవరి నెలలోపు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సందీప్ కిషన్, శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.