https://oktelugu.com/

ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ మూడు కథలను సిద్ధం చేశాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తున్నాడు. ఈమూవీ సెట్స్ పై ఉండగానే ఎన్టీఆర్ తన తదుపరి మూవీని త్రివిక్రమ్ తో ఉంటుందని ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రిలీజైంది. ఎన్టీఆర్ 30వ మూవీగా రాబోతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ.. నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించనున్నారు. Also Read: ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీ హిట్టా.. ఫ్లాపా? ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో గతంలో తెరకెక్కిన […]

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2020 / 03:57 PM IST
    Follow us on

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తున్నాడు. ఈమూవీ సెట్స్ పై ఉండగానే ఎన్టీఆర్ తన తదుపరి మూవీని త్రివిక్రమ్ తో ఉంటుందని ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రిలీజైంది. ఎన్టీఆర్ 30వ మూవీగా రాబోతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ.. నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించనున్నారు.

    Also Read: ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీ హిట్టా.. ఫ్లాపా?

    ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో గతంలో తెరకెక్కిన ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో కొమురంభీంగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ కు ప్యాన్ ఇండియా హీరో స్థాయి రావడం ఖాయంగా కన్పిస్తోంది. దీంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

    ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోయే మూవీ కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తారా లేక టాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని సినిమా చేస్తారా? అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్టీఆర్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొనే త్రివిక్రమ్ మూడు కథలు సిద్ధం చేయగా ఇందులో ఏ కథతో వెళ్లాలనేది మాత్రం ఇంకా డిసైడ్ కాలేదని టాక్ విన్పిస్తోంది.

    Also Read: పాయల్ కి ఈ సినిమా కూడా మైనసే !

    గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అరవింద సమేత’ త్రివిక్రమ్ స్టైల్లో కంటే ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ దృష్టిలో ఉంచుకొని చేసినట్లు కన్పిస్తోంది. దీంతో ఈసారి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటే ఆ విధంగానే సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ మార్చి నుంచి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ పట్టాలెక్కంటే మాత్రం ‘ఆర్ఆర్ఆర్’నుంచి ఎన్టీఆర్ రిలీవ్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో తెరకెక్కనుంది