https://oktelugu.com/

బిగ్ బాస్-4: అభిజిత్ సీక్రెట్ రిలీవ్ చేసిన తల్లి.. ఆటడేసుకున్న కంటెస్టెంట్స్..!

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. తన పంథాను కొనసాగిస్తూ కరోనా టైంలోనూ బిగ్ బాస్-4ను కొనసాగిస్తోంది. షోను విజయవంతంగా నడిపిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ప్రసుత్తం బిగ్ బాస్ 11వ వారానికి చేరుకుంది. బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంటుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. Also Read: ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ మూడు కథలను సిద్ధం చేశాడా? కరోనా నేపథ్యంలో ఈసారి బయటి నుంచి వ్యక్తులకు బిగ్ బాస్ లోకి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2020 / 04:05 PM IST
    Follow us on

    తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. తన పంథాను కొనసాగిస్తూ కరోనా టైంలోనూ బిగ్ బాస్-4ను కొనసాగిస్తోంది. షోను విజయవంతంగా నడిపిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ప్రసుత్తం బిగ్ బాస్ 11వ వారానికి చేరుకుంది. బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంటుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది.

    Also Read: ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ మూడు కథలను సిద్ధం చేశాడా?

    కరోనా నేపథ్యంలో ఈసారి బయటి నుంచి వ్యక్తులకు బిగ్ బాస్ లోకి ఎంట్రీలేదని టాక్ విన్పించింది. అయితే ఈ విషయంలో మాత్రం బిగ్ బాస్ సంచలన నిర్ణయం తీసుకొని అందరికీ షాకిచ్చాడు. గత సీజన్లో కొనసాగిన ఆనవాయితీని ఈ సీజన్లోనూ కొనసాగించాడు. ఈక్రమంలోనే కంటెస్టెంట్ల ఇంటి సభ్యులు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టడంతో సీన్ మొత్తం మారిపోయింది.

    11వ వారం నామినేషన్స్ సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. అభిజిత్-అఖిల్.. హరిక-సోహైల్.. లాస్య-అరియానాల మధ్య వాగ్వాదాలు జరగడంతో మొదటి రెండ్రోజులు హౌస్‌లో వాతావరణం వేడిగా మారింది. ఈక్రమంలోనే కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఉప్పు-నిప్పులా ఉన్న కంటెస్టెంట్లు మళ్లీ కలిసిపోయారు.

    తొలిరోజు అఖిల్.. దేత్తడి హారిక.. అభిజిత్.. అవినాష్‌ల తల్లులు ఒక్కొక్కరుగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎపిసోడ్ మొత్తం జాలీగా నడిచింది. రెండోరోజు అరియానా బాయ్‌ ఫ్రెండ్‌తోపాటు సోహెల్ తండ్రి.. మోనాల్ గజ్జర్ సోదరి ఇంట్లోకి వచ్చారు. వీళ్ల రాకతో హౌస్‌లో భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి.

    Also Read: ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీ హిట్టా.. ఫ్లాపా?

    ఈ క్రమంలో అభిజిత్ తల్లి కంటెస్టెంట్లతో చాలా మంచిగా కలిసిపోయారు. ఈ సందర్భంగా షోలో జరుగుతున్న గొడవల గురించి ఆమె మాట్లాడుతూ.. ‘కొట్టేసుకోండి.. అప్పుడే మజా ఉంటుంది’ అని నవ్వులు పూయించారు. అదే సమయంలో తన కొడుకు అభిజిత్ సిక్రెట్ ను బయటపెట్టారు.

    ‘అందరి ముందు నీకో సీక్రెట్ చెబుతున్నా. అదేమిటంటే నువ్వు తాతవు అయ్యావురా’ అని ఓ న్యూస్ చెప్పింది. దీంతో చిన్న వయసులోనే తాత అయిపోయానా అంటూ అభిజిత్ సిగ్గుతో తల దించుకున్నాడు. దీంతో పలువురు కంటెస్టెంట్స్ అతడిని ఆట పట్టించారు. ఇప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ తో ఆకట్టుకుంటున్న అభిజిత్ తన తల్లి మూలంగా తాత ఇమేజ్ లోకి మారాల్సి వచ్చింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్