Trivikram And Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనటువంటి క్రేజ్ ను సంపాదించుకున్న ఒకే ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచి ఆ సినిమా కోసం తన అభిమానులు తీవ్రమైన కసరత్తులను చేస్తూ మొదటి రోజు మొదటి షో చూడాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే ఇతర హీరోలతో పోలిస్తే పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఎక్కువగా ఉంటారని చాలామంది చెబుతుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్ ఏం చెబితే దాన్ని శిరసావహిస్తూ పాటిస్తూ ముందుకు దూసుకెళ్తుంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండే విధంగా చూసుకుంటూ వస్తున్నాడు. ఇక ఈనెల 25వ తేదీన ఓజీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ రాజకీయంగా ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతను కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే తను పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలి. ఆయనకు ఏ సినిమాలైతే తొందరగా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే తన అభిమానులు తనని ఎలా చూడాలనుకుంటున్నారు అనే విషయాల మీద త్రివిక్రమ్ యొక్క సలహాలైతే పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు.
Also Read: పవన్ కళ్యాణ్ విషయంలో సుజీత్ ఆ ఒక్క తప్పు చేశాడా..?
దానికి తగ్గట్టుగానే రీమేక్ సినిమాలైతే తొందరగా అయిపోతాయనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి సెట్ అయ్యే రీమేక్ సినిమాలను సెలెక్ట్ చేసి మరి పవన్ కళ్యాణ్ తో ఆ సినిమాలను చేసేలా ప్రణాళికలు రూపొందించాడు.
ఇక అందులో భాగంగా వచ్చినవే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో మూవీస్… ఈ మూడు సినిమాల ద్వారా త్రివిక్రమ్ శ్రీనివాస్ దాదాపు 200 కోట్ల వరకు సంపాదించడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక దాంతో పాటుగా మరికొన్ని సినిమాలతో కూడా డబ్బులు సంపాదించాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
నిజానికి పవన్ కళ్యాణ్ మీద ఇష్టం తో త్రివిక్రమ్ అలా చేశాడు అని కొంత మంది చెబుతున్నారు. మరి వీరిలో ఏది నిజం అనేది క్లారిటీగా తెలియదు. కానీ మొత్తానికైతే త్రివిక్రమ్ తన సినిమాలను పక్కన పెట్టి మరి పవన్ కళ్యాణ్ సినిమాలకు హెల్ప్ చేయడానికి గల కారణం ఏంటి అనే ధోరణిలో కొంతమంది కొన్ని అనుమానాలనైతే వ్యక్తం చేస్తున్నారు…