Anupama Comments On Sukumar: యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). ఈమె కేవలం ఒక్క భాషకు మాత్రమే పరిమితం కాదు. తెలుగు తో పాటు ఆమెకు తమిళం మరియు మలయాళం లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ తెలుగు ఆడియన్స్ ఈమెని తమ ఇంటి ఆడపిల్ల లాగా చూస్తారు. అందం తో పాటు, అద్భుతమైన నటన ఈమె సొంతం. అందుకే ఎక్కువగా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ఉంటుంది. గత ఏడాది ఈమె టిల్లు స్క్వేర్ లో విలన్ రోల్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ఆమె ‘పరదా’ చిత్రం తో మన ముందుకు వచ్చింది. రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండి మంచి రేటింగ్స్ అయితే వచ్చాయి కానీ, కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అవ్వలేదు.
Also Read: పవన్ కళ్యాణ్ విషయంలో సుజీత్ ఆ ఒక్క తప్పు చేశాడా..?
అయితే ఈ సినిమా విడుదల తర్వాత మూవీ టీం ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ లో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘ రంగస్థలం సినిమా సమయం లో హీరోయిన్ రోల్ కోసం డైరెక్టర్ సుకుమార్ నన్ను సంప్రదించాడు. నేను ఆ సినిమా చేయడానికి సిద్ధం గా ఉన్నాను. కానీ ఇంతలోపే నాకు చెప్పకుండా వేరే హీరోయిన్ ని తీసుకున్నారు. మీడియా దానిని అనుపమ పరమేశ్వరన్ రామ్ చరణ్ సినిమాని రిజెక్ట్ చేసింది అంటూ ప్రచారం చేసింది. కేవలం ఆ ఒక్క రూమర్ కారణంగా నాకు ఆరు నెలలు పాటు సినిమాలు దొరకలేదు. కెరీర్ లో గడ్డు కాలాన్ని ఎదురుకోవాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఆమె మాట్లాడిన మాటలను చూసి పాపం అనుపమ కి ఇంత అన్యాయం జరిగిందా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయినా ఒక హీరోయిన్ ని సంప్రదించిన తర్వాత ఆమె సమాధానం చెప్పేలోపు వేరే హీరోయిన్ ని తీసుకోవడం ఏమిటి?, సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్స్ కూడా ఇలాంటివి చేస్తారా?, అసలు ఊహించలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఒకవేళ రంగస్థలం చిత్రం అనుపమ చేసుంటే ఆమె కెరీర్ నేడు వేరేలా ఉండేది. మీడియం రేంజ్ హీరోలతో కాకుండా, పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన ఆమె హీరోయిన్ గా నటించి ఉండేది. వాళ్ళతో కలిసి నటించకపోయినా అనుపమ పరమేశ్వరన్ పైకి ఎదిగింది, పెద్ద రేంజ్ లోనే కొనసాగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు కానీ, ప్రేక్షకులకు అనుపమ లాంటి హీరోయిన్ తో తమ అభిమాన హీరోని చూసే అదృష్టం పోయింది కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
“#Sukumar sir approached me for #Rangasthalam. I was all prepared to do it, but they replaced me with another heroine.
Media portrayed it as ‘ANUPAMA REJECTED RAM CHARAN’S FILM’ because of that rumour, I didn’t get work for six months.”
– #Anupama | #RamCharan pic.twitter.com/zHGwnv2Vu2
— Movies4u Official (@Movies4u_Officl) September 2, 2025