Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) ‘అగ్ని పరీక్ష'(Agnipareeksha) షో ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. కేవలం రెండు ఎపిసోడ్స్ దాటితే ఈ సీజన్ అయిపోతుంది. ఇప్పటి వరకు స్ట్రీమింగ్ అయినా అన్ని ఎపిసోడ్స్ కి ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ ఉంది కానీ, గత రెండు మూడు ఎపిసోడ్స్ నుండి మాత్రం షో ఆసక్తికరంగా సాగుతుంది. ఇదంతా పక్కన పెడితే నిన్న ప్రసారమైన ఎపిసోడ్ లో ప్రసన్న కుమార్ మరియు శ్వేతా శెట్టి ని ఎలిమినేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నిన్న జరిగిన టాస్కులు ఆధారంగా మర్యాద మనీష్ కి ఇచ్చిన ఎల్లో కార్డుని వెనక్కి తీసేసుకున్నారు. ఎందుకంటే ఎల్లో కార్డు వచ్చిన కంటెస్టెంట్స్ కి అభిజిత్ ఒక బంపర్ ఆఫర్ ఇస్తూ, ఈరోజు ఎవరైతే అద్భుతంగా టాస్కులను ఆడుతారో, వాళ్ళ నుండి నేను ఎల్లో కార్డు వెనక్కి తీసేసుకుంటాను అంటాడు.
Also Read: పవన్ కళ్యాణ్ విషయంలో సుజీత్ ఆ ఒక్క తప్పు చేశాడా..?
మర్యాద మనీష్ టాస్కులు అద్భుతంగా ఆడి తనకు ఇచ్చిన ఎల్లో కార్డు ని అభిజిత్ వెనక్కి తీసుకునేలా చేస్తాడు. ఇంతకీ టాస్క్ ఏమిటంటే గుంపుగా ఉన్న మూటలను కంటెస్టెంట్స్ అందరూ తీసుకోవాలి. ఆ తర్వాత బొక్కలు ఉన్న కొన్ని చెక్కలను తీసుకొచ్చి, ఒక పాయింట్ వద్ద నిల్చొని, ఆ బొక్కల్లో పడేలాగా మూటలను విసరాలి. అలా ఎవరైతే ఎక్కువ మూటలను బొక్కల్లో పడేలా చేస్తారో వాళ్ళు ఈ టాస్కు గెలిచినట్టు అన్నమాట. ఈ టాస్క్ లో డెమోన్ పవన్ మరియు పవన్ కళ్యాణ్ టీం, మర్యాద మనీష్ మరియు దివ్య టీం సరిసమానంగా ఆడుతారు. ఆ తర్వాత వీళ్లిద్దరికీ ఒక టై బ్రేకర్ పెట్టగా, మర్యాద మనీష్ గెలుస్తాడు. ఇక ఈ టాస్కులో వరస్ట్ పెరఫార్మెర్స్ గా శ్వేతా శెట్టి మరియు ప్రసన్న కుమార్ లను ఎంపిక చేస్తారు జడ్జీలు. అప్పటికే వీళ్లిద్దరి దగ్గర ఎల్లో కార్డు ఉంది, ఇంకో ఎల్లో కార్డు అదనంగా రావడం తో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.
ప్రసన్న కుమార్ బిగ్ బాస్ హౌస్ కి పనికి రాడు అనే విషయం గత రెండు మూడు ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఆడియన్స్ కి అర్థం అయిపోయింది. ప్రసన్న కుమార్ కూడా ఈ విషయాన్నీ అంగీకరించాడు. ఆయనకు ఎల్లో కార్డు ఇవ్వడం సమంజసమే. కానీ శ్వేతా శెట్టి కి ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదని అందరికీ అనిపించింది. టాస్కులు నిర్వహించిన ప్రతీసారీ ఆమె తన వైపు నుండి బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పటి వరకు అసలు ఏ టాస్కు కూడా సరిగా ఆడని అనూష రత్నం వంటి వారిని వదిలేసి, శ్వేతా శెట్టి ని బయటకి పంపడం అన్యాయంగా అనిపించింది. ఎక్కడో లండన్ లో ఉండే ఆమె, బిగ్ బాస్ మీద ఇష్టం తో ఇండియా కి వచ్చింది. తన తల్లి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా బిగ్ బాస్ లో పాల్గొనడానికి సిద్దపడింది అంటే ఆమెకు ఈ షో మీద ఉన్న ఇష్టం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దురదృష్టం కొద్దీ పాపం ఆమె తల్లి రీసెంట్ గానే కన్ను మూసింది. ఇది శ్వేతా శెట్టి కి చాలా కష్టతరమైన సమయం అనే చెప్పాలి పాపం.