Jani Master: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న జానీ మాస్టర్ వరుస సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేస్తూ టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. ఇంకా ప్రభుదేవా మాస్టర్ సినిమాకు కూడా కొరియోగ్రఫీ చేసే స్థాయి కి ఎదిగిన ఆయనకి అనుకోని ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. తన అసిస్టెంట్ తనమీద కంప్లైంట్ చేయడంతో ఆయన జైల్ కి వెళ్లసి వచ్చింది. ఇక రీసెంట్ గా బేయిల్ మీద బయటికి వచ్చిన జానీ మాస్టర్ మళ్లీ సినిమాలు చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అసలు మొదటి నుంచి కూడా మెగా ఫ్యామిలీకి అండ గా ఉంటూ వస్తున్నాడు. జానీ మాస్టర్ ని రామ్ చరణ్ బాగా ఎంకరేజ్ చేశాడు. రచ్చ సినిమాలోని డిల్లక్ డిల్లక్ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ ఆ సాంగ్ తో ఒక్కసారి అతని తలరాత మారిపోయిందనే చెప్పాలి. ఇక దాంతో అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కూడా తను కొరియోగ్రాఫర్ గా చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఆయన ఎక్కువగా మెగా ఫ్యామిలీ కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు.
కాబట్టి అతనిని ఎలాగైనా సరే బుక్ చేయ్యలనే ఉద్దేశ్యం తో కొంతమంది ప్రనిలిక ప్రకారమే ఆయన్ని బుక్ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన ఎక్కువగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అయితే తను రాజకీయ పార్టీ పెట్టి ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో జానీ మాస్టర్ కూడా పవన్ కళ్యాణ్ సరసన నిలబడి జనసేన పార్టీకి అండగా ప్రచారం కూడా చేశాడు.
ఇక మొత్తానికైతే ఆయనను ఎలాగైనా సరే మెగా ఫ్యామిలీ నుంచి దూరం చేయాలి. జనసేన పార్టీ నుంచి తనను తప్పించాలనే ఉద్దేశ్యం తోనే కొంతమంది కావాలనే ఆయన్ని కేసులో ఇరికించారు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. మరి ఇందులో ఒక స్టార్ హీరో కూడా ఇన్వాల్వ్ అయ్యాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు కానీ మొత్తానికి జానీ మాస్టర్ మీద ఉచ్చు బిగించారనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా జానీ మాస్టర్ ఇంతకు ముందులా సినిమాలను కొరియోగ్రఫీ చేయలేకపోవచ్చు.
తనకు అంత మంచి అవకాశం కూడా రాకపోవచ్చు అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇది ఏమైనా కూడా జానీ మాస్టర్ తనకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకున్న తర్వాత ఇలాంటివి జరగడం అనేది ఆయన కెరియర్ మీద భారీ దెబ్బ కొట్టిందనే చెప్పాలి. అందుకే ఎదిగే సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగడం చాలా కీలకమని అందరూ చెబుతూ ఉంటారు…