https://oktelugu.com/

Drying Vegetables: కూరగాయలను ఎండబెట్టి కోట్లు సంపాదిస్తున్నారు..!

భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడి ప్రజలలు 70 శాతం వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. దీంతో రైతులు ఎక్కువగానే ఉంటారు. అయితే రైతులు పండించే పంటలు ఎక్కువగా ఉన్నా.. మార్కెట్లో మాత్రం నిత్యావసరాల ధరలు అధికంగానే ఉంటున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. పంటలు పండించే సమయంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు

Written By:
  • Srinivas
  • , Updated On : October 28, 2024 / 12:31 PM IST

    Drying-vegetables

    Follow us on

    Drying Vegetables:భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడి ప్రజలలు 70 శాతం వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. దీంతో రైతులు ఎక్కువగానే ఉంటారు. అయితే రైతులు పండించే పంటలు ఎక్కువగా ఉన్నా.. మార్కెట్లో మాత్రం నిత్యావసరాల ధరలు అధికంగానే ఉంటున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. పంటలు పండించే సమయంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. పంటకు సరైన నీరు అందకపోవడం.. చీడపురుగులు బెడదతో పాటు తుఫాను కారణంగా చాలా వరకు నష్టపోతుంటాయి. ఆ తరువాత పంట చేతికొచ్చాక కూడా కొన్ని సమస్యలు తప్పవు. పంటకు సరైన గిట్టు బాటు ధర లేకపోవడం.. డిమాండ్ కు తగిన విధంగా సప్లయ్ ఉండదు. ఈ కారణంగా అటు రైతులు సరైన ఆదాయం పొందలేక .. ఇటు వినియోగదారులకు అవసరమైన సరుకులు అందలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సమస్యకు కొందరు పరిష్కారం కనుగొన్నారు. కాస్త టెక్నాలజీని ఉపయోగించిం పంటలు ఎండబెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా అటు రైతులకు లక్షల్లో ఆదాయం వస్తుండగా.. ఇటు వినియోగదారులకు అవసరమైన సరుకులు అందుబాటులో ఉంటున్నాయి. ఈ ఆసక్తి స్టోరీ వివరాల్లోకి వెళితే..

    ప్రస్తుత కాలంలో ప్రతీ రంగంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. వ్యవసాయంలోనూ యాంత్రీకరణ ఎప్పుడో ప్రారంభమైంది. అయితే పంట నష్టం నివారించడానికి, కూరగాయల ధరలు తగ్గించడానికి కొందరు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహారాష్ట్రకు చెందిన ఆరుగురు వ్యక్తులు ‘ముంబా’ అనే ప్రాజెక్టును ప్రారంభించారు. సాధారణంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో వాటిని పారవేస్తుంంటారు. టామోటాలకు ధర పడిపోయినటప్పుడు వారిటి మేకలకు వేసిన దృశ్యాలను చాలా వరకుచూశాం. ఇలాంటి పరిస్థితి ఉండకుండా ‘ముంబా’ ప్రాజెక్టు ద్వారా కూరగాయాలను ఎండబెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

    ఈ ప్రాజెక్టులో భాగంగా రైతులు నుంచి కూరగాయలను సేకరిస్తారు. వారికి సరైన ధరను చెల్లించి వీటిని కొనుగోలు చేస్తారు. ఆ తరువాత వీటిని సోలార్ కండక్షన్ డ్రయ్యర్ ద్వారా వీటిని ఎండబెడుతారు. ఇందులో దెబ్బతిన్న కూరగాయలు లేదా విక్రయం కాని కూరగాయలను కూడా తీసుకుంటారు. వీటిని డ్రై చేసిన తరువాత హై క్వాలిటీ ఉండేలా చూస్తారు. వీటికి సెల్ప్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో వీటిని మార్కెట్లో విక్రయించి అధిక లాభాలు పొందుతున్నారు.

    ‘ముంబా’ ప్రాజెక్టులో 3500 మంది రైతులు పంనిచేస్తున్నారు. వీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూరగాయలను సేకరించి తెచ్చి ఇస్తారు. ఇందుకోసం వీరు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ‘ఎస్4 ఎస్ టెక్నాలజీ’ ద్వారా తయారు చేస్తున్నఈ డ్రై కూరగాయలను ‘ముంబా’ బ్రాండ్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తుంటారు. ఈ ప్రాజెక్టు వల్ల అటు రైతులకు ఇటు వినియోగదారులకు లాభదాయకం కానుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు లో సోలార్ పద్దతిలో వీటిని ఆరబెడుతుండడంతో మరింత ప్రయోజనం కలగనుంది. కూరగాయలను డ్రై చేయడంలో పునరుత్పాదక శక్తిని, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు సోలార్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. సోలార్ ను ఉపయోగించడం వల్ల కరెంట్ కూడా ఆదా అవుతుందని ప్రాజెక్టు నిర్వాహకులు చెబుతున్నారు.
    .