Surya: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ‘రాజకుమారుడు ‘ సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక ఆయన చేసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో ఆయన చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతాడనే పేరు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన మురారి, ఒక్కడు లాంటి బ్యాక్ టు బ్యాక్ భారీ సక్సెస్ లను అందుకోవడంతో స్టార్ హీరోగా ఎదిగాడు. అలాగే పోకిరి సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో పెను ప్రభంజనాన్ని సృష్టించి మొదటి ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పటికీ కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఇండస్ట్రీలో మరొకరు లేరనేది వాస్తవం… ప్రస్తుతం ఆయన రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటిని తిరగరాయాలనే ఉద్దేశ్యంతో తను విపరీతంగా కష్టపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనకు సంబంధించిన ఒక కొత్త లుక్ అయితే బయటకు వచ్చింది. ఇక ఆ సినిమా కోసమే రాజమౌళి మహేష్ బాబు చాలా తీవ్రంగా కసరత్తులు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.
కానీ మహేష్ బాబు తన కెరియర్ లో వదిలేసుకున్న ఒక రెండు సినిమాలు సూర్య కి టర్నింగ్ పాయింట్ కి నిలిచాయనే చెప్పాలి. ఇక ఆ సినిమాలు ఏంటి అంటే…మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ‘గజిని ‘, ‘సేవంత్ సెన్స్’ ఈ రెండు సినిమాలను కూడా మహేష్ బాబు చేయాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమాలను తను చేయలేకపోయాడు.
నిజానికి మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్ లో తెలుగు, తమిళం లో ఈ సినిమాలు వచ్చి ఉంటే రెండు భాషల్లో మహేష్ బాబు స్టార్ హీరోగా ఎదిగేవాడు. ఇక గజిని సినిమాలో గుండు కొట్టించుకొని కనపడే క్యారెక్టర్ కావడంతో మహేష్ బాబు ఆ పాత్ర మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక ఆ తర్వాత సెవెంత్ సెన్స్ సినిమాని కూడా మహేష్ బాబు తో చేయాలని భావించాడు. కానీ ఆ స్టోరీ కూడా మహేష్ బాబుకి పెద్దగా నచ్చలేదట.
ఇక దానివల్లే ఆ సినిమల్లో సూర్యని హీరోగా పెట్టి తీసి మురుగ దాస్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు సూర్య కెరియర్ లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ లనే చెప్పాలి. వీటి వల్లే ఆయన స్టార్ హీరోగా కూడా ఎదిగాడు. మొత్తానికైతే ఈ రెండు సినిమాలు మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కినవే కావడం విశేషం…ఇంకా మురుగదాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘స్పైడర్ ‘ సినిమా భారీ డిజాస్టర్ గా మారింది…