https://oktelugu.com/

Hrithik Roshan And NTR: జూనియర్ ఎన్టీయార్ కోసం రంగం లోకి దిగుతున్న హృతిక్ రోషన్…కారణం ఏంటంటే..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన 'దేవర ' సినిమా ట్రెండ్ బాగా నడుస్తుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన రొమాంటిక్ సాంగ్ ను మొదటిసారి విన్నప్పుడు అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. కానీ ఎక్కువ సార్లు వింటుంటే మాత్రం మంచి కిక్ ఇస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 18, 2024 / 08:34 AM IST

    Hrithik Roshan And NTR

    Follow us on

    Hrithik Roshan And NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు గుర్తుండిపోయే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈయన ఇండస్ట్రీ కి చేసిన సేవల వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఈ పొజిషన్ లో ఉంది. తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న ఒకే ఒక నటుడు కూడా ఈయనే కావడం విశేషం… ఇదిలా ఉంటే ఈ ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీయార్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదగడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన దేవర సినిమాతో చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక సర్ప్రైజ్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 అనే సినిమా చేస్తున్నాడు.

    ఇక అందులో భాగంగానే హృతిక్ రోషన్ తో కలిసి తను స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పటి వరకు ఎన్టీయార్ వార్ 2 లో చాలా తక్కువ రోజులే షూట్ చేసినప్పటికీ తనకి హృతిక్ రోషన్ కి మధ్య మంచి బాండింగ్ అయితే ఏర్పడిందట. ఇక ఆ బాండింగ్ తోనే దేవర సినిమాలోని ఒక సాంగ్ లో హృతిక్ రోషన్ కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి హృతిక్ రోషన్ చాలా మంచి డాన్సర్ అలాగే ఎన్టీయార్ కూడా అదిరిపోయే స్టెప్పులు వేయగలరు.

    కాబట్టి ఒక సాంగ్ చివర్లో హృతిక్ రోషన్ వచ్చి ఎన్టీయార్ తో కలిసి డ్యాన్స్ చేస్తాడట. ఇక స్క్రీన్ మీద వీళ్లిద్దరూ ఏకకాలం లో డాన్స్ చేస్తూ మనకు కనిపించబోతున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియదు. కానీ ఈ సినిమా కోసం హృతిక్ రోషన్ రంగంలోకి దిగుతున్నాడనే విషయం మీద మాత్రం బాలీవుడ్ మీడియా కూడా కొన్ని కథనాల్ని రాస్తుంది.

    ఇక మొత్తానికైతే ఇటు హృతిక్ రోషన్, అటు ఎన్టీఆర్ ఇద్దరు సమఉజ్జీలుగా వస్తున్న ‘వార్ 2’ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సౌత్, నార్త్ ఇద్దరి హీరోలను కలుపుతూ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే 200 కోట్ల వరకు కలెక్షన్లను కూడా రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి. ఇక దేవర సినిమా వార్ 2 సినిమా రెండు కనక సూపర్ సక్సెస్ అయితే ఎన్టీఆర్ ని ఆపేవారు ఇండియాలో మరెవరు లేరు అనేది మాత్రం వాస్తవం… చూడాలి మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి పెను ప్రభంజనాలను సృష్టిస్తాడు అనేది…