https://oktelugu.com/

Senior Heroes: మన సీనియర్ హీరోల పేర్లు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చే డైలాగ్స్ ఇవే…

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంటారు... ఇక వాళ్లే ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగుతారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 18, 2024 / 08:16 AM IST

    Senior Heroes

    Follow us on

    Senior Heroes: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలు తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి వరుస గా సినిమాలు చేస్తు ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సూపర్ సక్సెస్ అవ్వాలని ప్రతి హీరో కూడా కోరుకుంటాడు. ఇక ఇదిలా ఉంటే ప్రతి హీరోకి ఒక సపరేట్ మేనరిజం అనేది ఉంటుంది. అలాగే వాళ్ల కంటు ఒక రిజిస్టర్ డైలాగ్ కూడా ఉంటుంది. ఇక చిరంజీవి ని కనక తీసుకున్నట్లైతే ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో ఆయన చెప్పిన ‘చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ఫాడిస్తాను’ అంటూ తను చెప్పిన డైలాగు ఆయన ఎంటైర్ కెరియర్ లో అభిమానులు గుర్తుంచుకునేలా ప్రతి ఒక్కరికి రిజిస్టర్ అయిపోయిందనే చెప్పాలి. చిరంజీవి ప్రస్తావన వచ్చిన వెంటనే అందరికీ గుర్తుకు వచ్చే డైలాగ్ కూడా ఇదే కావడం విశేషం…

    ఇక నాగార్జున విషయానికొస్తే నాగార్జున ‘ఘనరా బుల్లోడు’ సినిమాలో చెప్పిన ‘సుర్రు సుమ్మాయి పోద్ది’ అనే డైలాగ్ కూడా నాగార్జున కెరీర్ ని చాలావరకు మార్చేసిందనే చెప్పాలి. అప్పటివరకు సాఫ్ట్ లుక్ లో ఉన్న నాగార్జున ఒక్కసారిగా ఈ సినిమాతో మంచి మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి డైలాగులను చెప్పడం వల్లే ఆయన ఇండస్ట్రీలో ఇన్ని రోజులపాటు సర్వేవల్ అవుతూ వస్తున్నాడు…

    బాలయ్య బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చెప్పిన ప్రతి డైలాగు ఫేమస్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ‘సమరసింహా రెడ్డి ‘ సినిమాలో ఆయన చెప్పిన ‘వీర రాఘవరెడ్డి నీ ఇంటికిచ్చ నీ నట్టింటికి వచ్చా’ అనే డైలాగ్ అయితే ఇప్పటివరకు ప్రతి ఒక్కరి నోట్లో నానుతూనే ఉంటుంది…

    ఇక వెంకటేష్ విషయానికి వస్తే ఈయన గణేష్ సినిమాలో చెప్పిన ‘ఎని సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్’ అనే డైలాగ్ మాత్రం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోవడమే కాకుండా వెంకటేష్ కి చాలామంది అభిమానులను కూడా కట్టబెట్టిందనే చెప్పాలి. ఇక అప్పటి దాకా మొత్తం ఫ్యామిలీ సినిమాలను చేసుకుంటూ ఉండే వెంకటేష్ కి మంచి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది గణేష్ అనే చెప్పాలి. ఇక అప్పట్లో ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది…

    ఇలా మన సీనియర్ హీరోలు అందరూ వాళ్ళ చెప్పిన డైలాగులతో వాళ్ళకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని ఇండస్ట్రీలో వాళ్ళ పేరు చెప్పగానే వాళ్ళ రిజిస్టర్ డైలాగులు గుర్తుకొచ్చేంత రేంజ్ లో జనాల్లోకి చొచ్చుకొని పోయారు. ఇక దానివల్లే వాళ్ళు ఈరోజు కి ఇంకా సినిమాలు చేయగలుగుతున్నారనేది మాత్రం వాస్తవం…అలా ఒక హీరో తన ఇంపాక్ట్ చూపించినప్పుడే ప్రేక్షకులు కూడా అతన్ని ఎక్కువ రోజులు పాటు ఆదరించే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.