Prabhas movies impact on heroines career: సినిమా హీరో అంటే సామాన్య జనాల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. హైట్ లో గాని, డాన్స్ వేయడంలో గాని, ఫైట్స్ చేయడంలో గాని ఒక ప్రత్యేకతను చాటుకోవాలి. అలాంటప్పుడే ప్రేక్షకులు అతన్ని హీరోగా స్వీకరిస్తారు… హీరో అనే పదానికి పర్ఫెక్ట్ కటౌట్ లా ఉండే ఒకే ఒక తెలుగు హీరో ప్రభాస్… ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడు నిరాశ పరచలేదు. ఎందుకంటే అతను మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. కాబట్టి ఆ ప్రేక్షకులకు ఏం కావాలో ఆ అంశాలన్నీ ఆయన సినిమాలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు వాళ్ళను అలరిస్తుంటాయి. వర్షం సినిమా నుంచి సక్సెస్ ల పరంపరను కొనసాగిస్తున్న ప్రభాస్ ఇప్పటివరకు పాన్ ఇండియాలో భారీ సంచలనాలను క్రియేట్ చేశాడు… తన ఫ్లాప్ సినిమాలకు సైతం వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాని కూడా చేస్తుండడం విశేషం… ప్రభాస్ ఎప్పుడు రెండు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఫౌజీ సినిమా పూర్తి అయిన వెంటనే స్పిరిట్ ని స్టార్ట్ చేశాడు. ఇక తొందరలోనే ‘కల్కి 2’ సినిమా షూట్ లో పాల్గొనడానికి ప్రయత్నాలైతే చేస్తున్నాడు. ఇప్పటికే కల్కి 2 ?మూవీకి సంబంధించిన పూర్తి సెట్ వర్క్ అయిపోయింది. ప్రభాస్ లేకుండా ఉన్న సన్నివేశాలను చిత్రీకరించే పనిలో దర్శకుడు బిజీగా ఉన్నాడు…
అక్టోబర్ వరకు స్పిరిట్ సినిమా షూటింగ్ లోనే పాల్గొనబోతున్న ప్రభాస్ అక్టోబర్ తర్వాత నుంచి కల్కి 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు… ఇక ప్రభాస్ పక్కన నటించిన చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ముగ్గురు హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీ లో అడ్రస్ లేకుండా గల్లంతయ్యారనే చెప్పాలి…
Also Read: ‘నీ అయ్య వడ్డీ…నీ బిడ్డ కడితే…నువ్వేమి పొడిచావనే’..పెద్ది 2వ పాట వచ్చేస్తోంది !
ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన శ్రీదేవి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికి ఆమెకి పెద్దగా సక్సెసులు రాలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇక రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ పక్కన నటించిన హీరోయిన్ అన్షు సైతం ఆ తర్వాత మరే సినిమాలు చేయలేదు. ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది…
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెకండ్ హీరోయిన్ గా మంచి పాపులారిటిని సంపాదించుకున్న ఛార్మి సైతం చక్రం, పౌర్ణమి లాంటి సినిమాల్లో ప్రభాస్ పక్కన నటించి ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలను కోల్పోయింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే…