https://oktelugu.com/

బాలయ్య వచ్చేశాడు.. ఇక మిగిలింది మెగాస్టారేనా..!

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘సింహా’.. ‘లెజండ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. వీరద్దరి కాంబినేషన్లో హట్రిక్ మూవీ వస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ అత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనాతో ఈ సినిమా వాయిదా పడింది. Also Read: కరోనా నుంచి ఆ అగ్ర హీరో ఎస్కేప్ అయినట్టేనా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగులకు అనుమతి ఇవ్వడంతో టాలీవుడ్లో సినిమా సందడి మొదలైంది. యంగ్ హీరోలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2020 / 03:55 PM IST
    Follow us on

    నందమూరి బాలకృష్ణ తాజా చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘సింహా’.. ‘లెజండ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. వీరద్దరి కాంబినేషన్లో హట్రిక్ మూవీ వస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ అత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనాతో ఈ సినిమా వాయిదా పడింది.

    Also Read: కరోనా నుంచి ఆ అగ్ర హీరో ఎస్కేప్ అయినట్టేనా?

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగులకు అనుమతి ఇవ్వడంతో టాలీవుడ్లో సినిమా సందడి మొదలైంది. యంగ్ హీరోలు సినిమా షూటింగుల్లో పాల్గొంటుండగా సీనియర్ హీరోలు మాత్రం ఆచితుచి వ్యవహరిస్తున్నారు. 60ఏళ్లు పైబడిన వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుండటంతో సీనియర్ హీరోలు రిస్కు తీసుకోవడానికి ఇష్టపడం లేదని తెలుస్తోంది.

    కొద్దిరోజులుగా షూటింగులకు దూరంగా ఉంటున్న సీనియర్ హీరోలు క్రమంగా తమ సినిమాలను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఇటీవలే కింగ్ నాగార్జున తన ‘వైల్డ్ డాగ్’ మూవీ కోసం కూలుమానాలి వెళ్లాడు. 21రోజులపాటు అక్కడే షూటింగ్లో పాల్గొననున్నాడు. తాజాగా బాలకృష్ణ సైతం రంగంలోకి దిగి అభిమానుల్లో జోష్ నింపాడు.

    నేడు(అక్టోబర్‌ 29న) హైదరాబాద్‌లో బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో మూవీ రీ స్టార్ట్ అయింది. ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రభియనం చేస్తున్నాడు. బాలయ్య ఇందులో అఘోరగా కన్పించనుండటం విశేషం.

    Also Read: కాజల్ పెళ్లిసందడి షూరు.. ఫీలవుతున్న ఫాన్స్..!

    బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాల మాదిరిగానే ఈ మూవీ ఉండనుందని సమాచారం. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున.. బాలయ్య రంగంలోకి దిగడంతో మిగతా సినీయర్ హీరోలైన చిరంజీవి.. వెంకటేశ్ సినిమాలు ఎప్పుడు స్టాట్ అవుతాయనే చర్చ అభిమానుల్లో నడుస్తోంది. వీరిద్దరి సినిమాలు కూడా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది.