Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరు గ్రాండ్ సక్సెస్ అయ్యారు. నాగబాబు ఒక్కడు హీరో గా పలు సినిమాలు చేసి సక్సెస్ అవ్వలేకపోయాడు, ఆ తర్వాత ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా మారి ఆ విధంగా సక్సెస్ ఫుల్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆయన కుమారుడు వరుణ్ తేజ్ ఎంత పెద్ద సక్సెస్ ఫుల్ స్టార్ గా నిలిచాడో మన అందరికీ తెలిసిందే. కెరీర్ లో వినూతనమైన సినిమాలను తీస్తూ, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు. కానీ నాగ బాబు కూతురు నిహారిక కొణిదెల మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయింది.
చూసేందుకు ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ అమ్మాయి, నటనలో కూడా పర్వాలేదు అనిపించుకుంది. కానీ సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోకపోవడం వల్ల ఈమె నటిగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఆమె కొంతకాలం నటనకి టాటా చెప్పి, నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్లను నిర్మించింది. అవి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. ఇక నిహారిక కి సక్సెస్ దొరకడం కష్టమే అని అనుకుంటున్న సమయం లో ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. రేటింగ్స్, రివ్యూస్ మంచిగా రావడంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా డీసెంట్ స్థాయిలో వచ్చాయి. కొత్త వారితో, చక్కటి కథతో ఇలాంటి మంచి సినిమాని అందించినందుకు నిహారికకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. అయితే ఈ సినిమాకి ముందే నిహారిక ఒక క్రేజీ యంగ్ హీరో తో సినిమా తీసేందుకు సన్నాహాలు చేసిందట. ఆ హీరో నిహారిక కి డేట్స్ ఇచ్చి కూడా, చివరికి వేరే సినిమాకి కమిట్ అయ్యాడట. ఇదేమి అన్యాయం అని నిహారిక ఆ యంగ్ హీరోని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చెయ్యగా, అతను ఆమెకి అందుబాటులోకి కూడా రాలేదట. మెగా ఫ్యామిలీ కి చెందిన ఒక్క అమ్మాయికి ఇలాంటి సందర్భం రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదూ. నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన కొత్తలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆ ప్రాజెక్ట్ కి నిహారిక దాదాపుగా రెండు కోట్ల రూపాయిలు ఖర్చు చేసిందట.
అదంతా వృధా అవ్వడం తో నిహారిక మానసికంగా చాలా కృంగిపోయిందట. ఆ తర్వాత తన తండ్రి నాగబాబు ఇచ్చిన సలహాతో, అతి తక్కువ బడ్జెట్ తో కొత్తవాళ్లతో నిహారిక ఈ ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రం తీసి కెరీర్ లో తొలిసారి సినిమాల పరంగా సక్సెస్ ని చూసింది. ఈ ఏడాది మెగా ఫ్యామిలీ కి బాగా కలిసొచ్చింది, మా బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యాడు, మా పెద్ద నాన్న కి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది, మా రామ్ చరణ్ అన్నయ్య ఆస్కార్ అవార్డ్స్ వరకు వెళ్ళాడు, అదే ఊపులో నా సినిమాని కూడా హిట్ చెయ్యండి అంటూ నిహారిక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆమె కోరుకున్నట్టుగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు గ్రాండ్ సక్సెస్ చేసారు. కమర్షియల్ గా ఈ సినిమా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.