Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ‘దేవర ‘ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా కోసం ఎన్టీయార్ విపరీతంగా కష్టపడుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే ఎన్టీయార్ ఎందుకు ఇప్పుడే ప్రశాంత్ నీల్ తో సినిమాకి కమిట్ అయ్యాడు. ఇక ఆ సినిమాకే డేట్స్ మొత్తాన్ని కేటాయించబోతున్నాడు అంటూ ఆయన అభిమానుల్లో తీవ్రమైన కలవరమైతే రేగుతుంది. ఎందుకంటే వరుసగా దేవర సినిమా కు సంబంధించిన రెండు పార్టు లను పూర్తి చేసిన తర్వాతే మరొక సినిమా మీదికి తన ఫోకస్ ను షిఫ్ట్ చేస్తానని ఎన్టీయార్ గతంలో చాలా సార్లు చెప్పాడు. అయినప్పటికీ ఇప్పుడు అలా కాకుండా మొదటి పార్ట్ ఇంకా రిలీజ్ అవ్వకముందే ప్రశాంత్ నీల్ సినిమాకి కమిట్ అయ్యాడు.
ఈ సినిమా తొందర్లోనే రెగ్యూలర్ షూటింగ్ జరుపుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఎన్టీయార్ రాబోయే రోజుల్లో ఈ సినిమా మీదనే ఎక్కువ డేట్స్ కేటాయించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది… ఇక ఇప్పుడు ఇదంతా చూస్తున్న ట్రేడ్ పండితులు సైతం దేవర సినిమా బాగా వస్తుందంటూ ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పటికీ ఈ సినిమా మీద ఎన్టీఆర్ కి పెద్దగా అంచనాలు లేనట్టుగా కనిపిస్తున్నాయి.
అందుకే దేవర సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయన మరొక సినిమాకి కమిట్ అయ్యాడు. వరుసగా దేవరకి సంబంధించిన రెండు పార్ట్ లను రిలీజ్ చేసిన తర్వాత మరొక సినిమా మీదికి వెళ్లాల్సింది. కానీ దాన్ని మధ్యలోనే వదిలేసి ఇంకొక సినిమా చేస్తుండటం ఎంతవరకు కరెక్ట్ అంటూ ట్రేడ్ పండితులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికైతే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో కూడా ‘పుష్ప ‘ రెండు పార్టు లు కంప్లీట్ చేసిన తర్వాత మరొక సినిమా మీదికి వెళుతున్నాడు. ఇక ఇంతకు ముందు ‘బాహుబలి ‘ సినిమా చేసినప్పుడు ప్రభాస్ కూడా అలాగే మొదటి రెండు పార్టు లు కంప్లీట్ చేసిన తర్వాతనే ఇంకో సినిమా మీదికి వెళ్ళాడు.
ఇక ఇప్పుడు ఇదంతా చూస్తుంటే దేవర సినిమా తేడా కొట్టే విధంగా కనిపిస్తుంది. అందువల్లే సెకండ్ పార్ట్ ఉంటుందో లేదో అనే అనుమానంలో ఎన్టీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొదటి పార్ట్ సక్సెస్ అయితే రెండో పార్ట్ ని చిత్రీకరిస్తారట. లేకపోతే మాత్రం సెకండ్ పార్ట్ వచ్చే అవకాశాలు లేవంటూ సినిమా మేకర్స్ వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… చూడాలి మరి ఎన్టీయార్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…