https://oktelugu.com/

Ram Charan: ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా మూడు..రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ట్రిపుల్ బొనాంజా ప్లాన్ చేసిన శంకర్!

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటని విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పాటనే వినిపిస్తూ ఉంది. షూటింగ్ పూర్తి అయ్యాక టీజర్ ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 10, 2024 / 03:05 PM IST

    Ram Charan

    Follow us on

    Ram Charan: #RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. #RRR మూవీ షూటింగ్ అయిపోగానే రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ప్రారంభించాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సమయం లో శంకర్ కి మధ్యలో కమల్ హాసన్ తో తీస్తున్న ‘ఇండియన్ 2 ‘ చిత్రాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. దీంతో ‘గేమ్ చేంజర్’ చిత్రం బాగా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఎన్నో అవరోధాలను దాటుకొని ఈ చిత్రం లో రామ్ చరణ్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం ఇటీవలే పూర్తి అయ్యింది. మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ కూడా పూర్తి చేసి, ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

    ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటని విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పాటనే వినిపిస్తూ ఉంది. షూటింగ్ పూర్తి అయ్యాక టీజర్ ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారి రామ్ చరణ్ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రం లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని సినిమా షూటింగ్ ప్రారంభమైన కొత్తల్లోనే అభిమానులకు తెలిసింది. రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా బయటకి వచ్చాయి. కానీ ఈ చిత్రం లో కేవలం రెండు పాత్రలు కాదు, రామ్ చరణ్ మూడవ క్యారక్టర్ కూడా చేసాడని టాక్. ఆ క్యారక్టర్ కాస్త నెగటివ్ షేడ్స్ తో ఉంటుందని, రంగస్థలం , RRR తర్వాత రామ్ చరణ్ అద్భుతమైన నటన కనబర్చిన సినిమా ఇదే అవ్వుదని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. అయితే సినిమా మీద ఎంత హైప్ పెంచుతున్నా కూడా, శంకర్ ఇండియన్ 2 ఫలితం చూసి అభిమానులు కాస్త భయపడుతున్నారు. హిట్ , ఫ్లాప్ అనేది ఎవరికైనా సాధారణమే కదా, అందులో ఏముంది అని మీరంతా అనుకోవచ్చు. కానీ ఇండియన్ 2 లో శంకర్ టేకింగ్ అత్యంత నాసిరకంగా ఉంది.

    ఆ సన్నివేశాలు చూస్తే అసలు ఈ సినిమాకి నిజంగా శంకర్ దర్శకత్వం వహించాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతాయి. అంత నీచంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రీసెంట్ గానే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు. థియేట్రికల్ రన్ ఉన్నప్పటి కంటే, ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా మీద ట్రోల్ల్స్ విపరీతంగా ఉన్నాయి. ఇవన్నీ చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. కానీ ఈ సినిమాకి పని చేసినవారు మాత్రం రామ్ చరణ్ ఇరగ కుమ్మేసారు సినిమా అదిరిపోతోంది అని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కనీసం టీజర్ విడుదల అయ్యేవరకు వేచి చూడాలి.