https://oktelugu.com/

Rajamouli: మహేష్ బాబు మేకోవర్ కోసం రాజమౌళి అన్ని కోట్లు ఖర్చు చేశాడా..?ఇలాగైతే కష్టం సామి…

ఇండియాలో ఏ దర్శకుడికి దక్కని అరుదైన గౌరవం, క్రేజ్ ఒక రాజమౌళి మాత్రమే దక్కుతుందని చెప్పడంలోకి ఎంత మాత్రం అతిశక్తి లేదు. ఇండియాలో ఉన్న టాప్ హీరోలతో సైతం పోటీపడి వాళ్ళతో పాటు సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడిగా కూడా రాజమౌళి చరిత్రలో నిలిచాడు...

Written By:
  • Dharma
  • , Updated On : October 8, 2024 / 05:15 PM IST

    Rajamouli And Mahesh Babu

    Follow us on

    Rajamouli: రాజమౌళి ఏది చేసినా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఆయన సినిమాల్లో ఎలాగైతే విజువల్స్ తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాడా సినిమాకి ముందు తీసుకునే జాగ్రత్తల్లో కూడా అంతే గ్రాండీయర్ కనిపిస్తుంది. నిజానికి ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు మహేష్ బాబు మేకోవర్ లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. ఇక ఎప్పుడైతే మహేష్ బాబు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో అప్పటి నుంచి మహేష్ బాబు మీద ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ అతనికి ఒక డిఫరెంట్ మేకవర్ ను ప్రజెంట్ చేసే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికోసం ప్రొడ్యూసర్ దగ్గర నుంచి విపరీతమైన డబ్బులను కూడా రాజమౌళి ఖర్చు పెడుతున్నారట. ఇక ఇప్పటికే రెండు మూడు మేకోవర్ లలో మనకు దర్శనమిచ్చిన మహేష్ బాబు ఇప్పటికీ ఇంకా ఆయనకు సంబంధించిన కరెక్టు లుక్ అనేది ఫైనల్ కాలేదట.

    ఇప్పటివరకు తన మేకోవర్ మీద దాదాపు 20 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. కేవలం ఒక హీరో మేకోవర్ మీద ఇరవై కోట్లు ఖర్చుపెట్టిన రాజమౌళి సినిమా మీద ఏ రేంజ్ లో ఖర్చు పెడతాడో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ చూసుకొని మరి రాజమౌళి ముందుకు సాగుతూ ఉంటాడు.

    కనీసం కొంచెం తేడా వచ్చినా కూడా రాజమౌళి దాని క్యాన్సిల్ చేసి మరొక విధంగా ప్రయత్నం చేయడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఇక నిజానికైతే ఆయన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా వాటిని వడ్డీతో సహా ప్రేక్షకుడి దగ్గర నుంచి వసూలు చేసే అంత కెపాసిటీ అయితే రాజమౌళికి ఉంది. అందువల్లే ఆయన సినిమాలను ప్రేక్షకులు ఒకటికి రెండుసార్లు చూస్తూ ఎంటర్ టైన్ అవ్వడమే కాకుండా భారీ ఆనందాన్ని కూడా పొందుతారు.

    ఇక ప్రొడ్యూసర్లు కూడా విపరీతమైన డబ్బులను ఖర్చు పెడుతూ విపరీతమైన ప్రాఫిట్స్ ను కూడా సాధిస్తూ ఉంటారు… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం రాజమౌళి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుందనే చెప్పాలి…